
📌 Key Points
- మహేష్ బాబు స్టైలిష్ లుక్స్‌తో వారణాసి సెట్స్ అదుర్స్!
- రాజమౌళి దర్శకత్వంలో రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రం!
- హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్!
- 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి విడుదల!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ గురించి ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
రాజమౌళితో మహేష్ బాబు సెన్సేషనల్ మూవీ
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి(Varanasi)’. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
వెయ్యి కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ రేంజ్ లో సినిమా
తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు లుక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వారణాసి సినిమా కోసం అంటార్కిటికాకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో ట్రెండీ లుక్ లో కనిపించాడు. క్యాప్ ధరించి, గాగుల్స్ ధరించి క్రేజీ లుక్ లో కనిపించాడు. దీంతో, ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంటార్కిటికాలో షూటింగ్..రికార్డు క్రియేట్!
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అంటార్కిటికాలో మొదలుకానుంది. అందుకోసం మేకర్స్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న రెండవ సినిమాగా వారణాసి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా, చాలా ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు వారణాసి సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా పేజీని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


