|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahesh Babu: ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే..ఇక ముందు జాత‌రే

Published: 15-11-2025, 1:50 PM
Mahesh Babu: ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే..ఇక ముందు జాత‌రే

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్ ఇటీవల అట్టహాసంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, “ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే.. ఇక ముందు జాతరే” అని వ్యాఖ్యానించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

Key Points

1

SSMB29 సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఖరారు

2

రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్

4

'వారణాసి' దేశమంతా గర్వించే సినిమా అవుతుందని మహేష్ అభిప్రాయం

“వారణాసి” టైటిల్ అనౌన్స్‌మెంట్ అట్టహాసం

ప్రిన్స్ మహేష్ బాబు అలాగే జక్కన్న కాంబినేషన్ లో వారణాసి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరగ‌గా, తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. వేలాది అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు.

వారణాసి సినిమాతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కాబోతుంది అంటూ మహేష్ బాబు వెల్లడించారు. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ముందు ముందు జాతర అంటూ వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫ్యాన్స్ తో ముచ్చటించారు. పౌరాణికం చేయాలని నాన్న‌ ఎన్నోసార్లు చెప్పేవారు… నేను మాత్రం వినలేదన్నారు. ఆయ‌న మాట‌లు ఎప్పుడూ విన‌లేదు.. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారని తెలిపారు. వార‌ణాసి విడుద‌లైన త‌ర‌వాత దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుందని వ్యాఖ్యానించార మ‌హేష్‌.

మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు: “ఇక ముందు జాతరే”

రాజమౌళి-మహేష్ కాంబోపై భారీ అంచనాలు

మహేష్ బాబు మాటలను బట్టి ‘వారణాసి’ సినిమా ఒక అద్భుత సృష్టిగా నిలవబోతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత దేశమంతా గర్విస్తుందనే ఆయన నమ్మకం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.