|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రిన్స్ మహేష్ బాబుకు కోపం వచ్చిందా? వైరల్ అవుతున్న సెన్సేషనల్ కామెంట్స్!

Published: 09-06-2026, 4:47 PM
ప్రిన్స్ మహేష్ బాబుకు కోపం వచ్చిందా? వైరల్ అవుతున్న సెన్సేషనల్ కామెంట్స్!
  • మహేష్ బాబును ఇబ్బంది పెడుతున్న అభిమానుల అత్యుత్సాహంపై సంచలన వ్యాఖ్యలు వైరల్!
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్.
  • ఎయిర్‌పోర్టుల్లో సెల్ఫీల కోసం ఎగబడటంపై ప్రిన్స్ అసహనం, ప్రైవసీకి భంగం.
  • గతంలో కెమెరాలు లేని రోజులు గుర్తు చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ప్రిన్స్, తన ప్రైవసీ గురించి మాట్లాడిన మాటలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

మహేష్ బాబు ప్రైవసీకి భంగం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవేవి పట్టించుకోని రాజమౌళి వన విజన్‌లో తాను దూసుకుపోతున్నాడు. ఇక షూటింగ్‌ల నిమిత్తం వేరే దేశాలకు వెళ్లేటప్పుడు, లేదా ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టులో కొందరు చూపించే అత్యుత్సాహంపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మహేశ్ బాబు. ‘అప్పట్లో ఫోన్లకు కెమెరాలు ఉండేవి కాదు కాబట్టి.. బయట తిరిగిన పెద్ద ఇబ్బందిగా అనిపించేది కాదు. ఇప్పుడు అలా కాదు ఎయిర్ పోర్టులో దిగితే ఒక్కొక్కళ్లు సెల్ఫీలు అంటూ ఎగబడతారు. అది తప్పు అని నేను అనడం లేదు.. ఫ్యాన్స్ ఉత్సాహం అలాగే ఉంటుంది. కానీ, ఆ ఉత్సాహం ఓవర్ అయినప్పుడు మాత్రమే ప్రైవసీకి బంగం కలిగిద్ది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు కానీ, ఎప్పుడు ఇదే జరుగుతుంటే కొంచెం ఇబ్బంది అంతే’ అంటూ చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు.

రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్స్!

ఫ్యాన్స్ అత్యుత్సాహంపై ప్రిన్స్ అసహనం!

ప్రిన్స్ మహేష్ బాబు ప్రైవసీపై చేసిన వ్యాఖ్యలు అభిమానులలో చర్చకు దారితీశాయి. రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్స్‌తో పాటు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మన పేజీని చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.