
ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్టా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, కష్టాలు పంచుకున్నారు. ఫేమ్ ఉన్నా సొంతిల్లు లేదని, పరిశ్రమలో చాలా మంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ సంపాదనతో తన సొంత సినిమా తీస్తున్నానని తెలిపారు.
Key Points
ఫన్ బకెట్, బిగ్ బాస్ ద్వారా మహేష్ విట్టా బాగా పాపులర్ అయ్యాడు.
హైదరాబాద్‌లో సొంతిల్లు లేదు; దానికి కనీసం కోటి రూపాయలు కావాలి.
సినీ పరిశ్రమలో చాలా మంది మోసం చేసి, డబ్బులు ఎగ్గొట్టారని మహేష్ విట్టా తెలిపాడు.
బిగ్ బాస్, బయట సంపాదనతో తన సొంత సినిమాను హీరోగా, నిర్మాతగా తీస్తున్నాడు.
మహేష్ విట్టా: ఫేమ్ Vs ఆర్థిక కష్టాలు
Mahesh Vitta : ఫన్ బకెట్ కామెడీ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్న మహేష్ విట్టా ఆ తర్వాత సినిమాల్లో పాత్రలు చేస్తూ బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ విట్టా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Mahesh Vitta)
మహేష్ విట్టా సినీ పరిశ్రమలో చాలా మంది మోసం చేసారని చెప్తూ.. నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఫేమస్ అయితే చాలదు. డబ్బులు కావాలి. కనీసం కోటి రూపాయలు ఉండాలి ఇప్పుడు హైదరాబాద్ లో సొంతిల్లు ఉండాలంటే. నేను చాలా సినిమాలు చేసినా చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారు. చాలా మంది మోసం చేసే వాళ్ళు. చాలా ప్రొడక్షన్ హౌస్ లు డబ్బులు ఇవ్వలేదు. టీవీ ఫీల్డ్ లో లేట్ గా అయినా ఇస్తారు. కానీ సినిమాల్లో డబ్బులు రావు. కొంతమంది పని అయ్యాక డబ్బులు ఇవ్వం అని మొహం మీదే చెప్తారు. మనం గట్టిగా అడిగితే మన గురించి వాళ్ళు పరిశ్రమలో ఎక్కడ నెగిటివ్ గా చెప్తారేమో అని మనం సైలెంట్ గా ఉంటాము అని తెలిపాడు.
సినీ పరిశ్రమలో ఎదురైన మోసాలు, అనుభవాలు
అలాగే.. ఒకర్ని నమ్మి ఒక ప్రాజెక్టు అప్పచెప్తే హార్డ్ డిస్కులు తీసుకెళ్లి డబ్బులు ఇస్తేనే ఇస్తాను అన్నాడు. వాడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. వాడికేమన్న అయితే వాళ్ళ పేరెంట్స్ నన్ను అడుగుతారు. అందుకే నేను అది వదిలేసి మళ్ళీ డబ్బులు పెట్టి ఆ ప్రాజెక్టు ఇంకోసారి తీసాను, అలా కూడా నష్టపోయాను అని చెప్పాడు.
హీరోగా, నిర్మాతగా మహేష్ విట్టా కొత్త సినిమా
ఇక మహేష్ తాను హీరోగా, నిర్మాతగా మారుతున్నాను అని చెప్తూ.. నేను హీరోగా, నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చింది, బయట సంపాదించింది మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను. ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో నాతో వచ్చి కష్టపడిన వాళ్లంతా కలిసి దానికి పనిచేశాం. అది కిడ్నాప్ కామెడీ కథతో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. షూటింగ్ అంతా మా కడప జిల్లాలోనే చేశాం అని తెలిపాడు.
మహేష్ విట్టా తన ఆశలన్నీ తన సొంత సినిమాపై పెట్టుకున్నారు. పరిశ్రమలో కష్టాలను ఎదుర్కొని, సొంతంగా నిలబడాలని చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.


