
📌 Key Points
- 50 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్స్‌తో మలైకా అరోరా దుమ్మురేపింది, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని తెలిపింది.
- హనీ సింగ్‌తో కలిసి చేసిన ఆల్బమ్, ‘థామా’లో రష్మికతో కలిసి చేసిన స్పెషల్ సాంగ్‌తో మలైకా మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది.
- ఈ వయసులో ఐటమ్ సాంగ్స్ అవసరమా అంటూ ట్రోల్ చేసిన నెటిజన్లకు మలైకా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
- రష్మిక కంటే మలైకానే హైలైట్ అయ్యారంటూ కామెంట్స్, బోల్డ్ స్టెప్స్‌తో విమర్శలను సైతం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచారు. 50 ఏళ్ల వయసులో కూడా ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీనిపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్.
50 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్స్?
హాట్ ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన వయసుపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. 50 ఏళ్లలోనూ ఐటమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంటారు. ఇటీవల ఆమె హనీ సింగ్‌తో కలిసి చేసిన ఆల్బమ్, అలాగే ‘థామా’ చిత్రంలో రష్మిక మందన్నా తో చేసిన స్పెషల్ సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.
మహిళా సాధికారతకు నిదర్శనం అంటున్న మలైకా
అయితే, ఈ వయసులో ఇలాంటి ‘ఐటమ్ సాంగ్స్’ అవసరమా అంటూ సోషల్ మీడియాలో మలైకా అరోరాపై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మలైకా ఈ విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మలైక అరోరా.
మహిళలకు ఇదొక స్ఫూర్తి ఈ స్టేజ్‌లో డ్యాన్స్ నంబర్లు చేయడం తనకు ఎంతో శక్తినిస్తుందని (Empowering), ఇది మహిళ సాధికారత అని మలైకా పేర్కొన్నారు. “ఇది నాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నన్ను చూసి బయట ఉన్న మహిళలు కూడా స్ఫూర్తి పొందితే, వారు కూడా ఏదైనా సాధించగలమని భావిస్తే.. నా పని పూర్తయినట్లే. వయసుతో సంబంధం లేకుండా మనకు నచ్చినట్లు ఉండటమే అసలైన విజయం” అని మలైకా ధీమాగా చెప్పారు.
ట్రోల్ల్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మలైకా
రష్మిక కంటే మలైకానే హైలైట్ అయ్యారంటూ అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘చిల్‌గమ్’ అనే మ్యూజిక్ వీడియోలో మలైకా అరోరా చేసిన బోల్డ్ స్టెప్స్ విమర్శలకు దారితీసినా.. ఆమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
మలైకా అరోరా ఐటమ్ సాంగ్స్‌తో దుమ్ము రేపుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


