|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాళవిక మోహనన్: నేను ఇంతకు ముందు చేసిన దానికంటే ఇది ప్రత్యేకమైనది.. మాళవిక మోహనన్ కామెంట్స్

Published: 10-06-2025, 1:46 AM
మాళవిక మోహనన్: నేను ఇంతకు ముందు చేసిన దానికంటే ఇది ప్రత్యేకమైనది.. మాళవిక మోహనన్ కామెంట్స్

కోలీవుడ్ నటి మాళవిక మోహనన్ ‘సర్దార్ 2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసింది. బ్యాంకాక్‌లోని చిత్రీకరణను ఆమె ఎంతో ఆనందంగా గడిపిందని, కార్తీతో పనిచేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.

Key Points

1

మాళవిక మోహనన్ 'సర్దార్ 2' చిత్రీకరణను పూర్తి చేసింది.

2

బ్యాంకాక్‌లో చిత్రీకరణ చాలా ఆనందంగా సాగిందని ఆమె పేర్కొంది.

4

ఈ చిత్రం ఇంతకు ముందు చేసిన సినిమాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉందని తెలిపింది.

‘సర్దార్ 2’ చిత్రీకరణ ముగింపు

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సినీ కెరీర్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రజెంట్ ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘సర్దార్-2’ ఒకటి. తమిళ స్టార్ కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సర్దార్’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకోంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని చిత్రాలను పంచుకుంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

మాళవిక మోహనన్ అనుభవాలు

‘ఇది సర్దార్2 (Sardar2)యొక్క చివరి భాగం. నేను ఈ ప్రాజెక్ట్‌ను సినిమాలోనే అత్యంత సవాలుతో కూడిన షెడ్యూల్‌తో ప్రారంభించాను. అలాగే బ్యాంకాక్‌లో అత్యంత సరదా షెడ్యూల్‌తో ముగించాను. ఇది ఎంత పిచ్చి ప్రయాణం! కార్తీ మీరు పని చేయడానికి ఒక అద్భుతమైన రత్నం. మీతో వర్క్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ మిత్రన్‌కు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉంది. అలాగే ప్రత్యేకమైనది. త్వరలో సినిమాహాళ్లలో కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.

కార్తీతో సహకారం

And it’s a wrap for #Sardar2 ! 💥♥️🥷 I started this project with the most challenging schedule of the film & ended it with the most fun schedule in Bangkok ☺️ What a mad ride this one’s been! @Karthi_Offl you’ve been an absolute gem to work with. Who knew we had so many… pic.twitter.com/rPmGWGGYY2

చివరిగా, మాళవిక మోహనన్ ‘సర్దార్ 2’ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం అని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.