|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్?

Published: 16-10-2025, 8:15 PM
చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్?

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. దర్శకుడు బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత, రాబోయే 158వ చిత్రంలో హీరోయిన్‌గా మాళవికా మోహనన్ నటించనుందని తెలుస్తోంది. రాశీ ఖన్నా కూడా ఇందులో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది.

Key Points

1

చిరంజీవి 158వ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించనున్నారు.

2

కెవిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది.

4

మాళవికా మోహనన్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తోంది.

చిరంజీవి 158వ సినిమా హీరోయిన్స్

చిరంజీవి సరసన మాళవికా మోహనన్‌ నటించనున్నారా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర)ల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. కెవిన్‌ ప్రోడక్షన్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. చిరంజీవి కెరీర్‌లోని 158వ సినిమా ఇది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉందని, ఒక హీరోయిన్‌గా మాళవికా మోహనన్, మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

బాబీ దర్శకత్వంలో చిరు కొత్త చిత్రం

గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందని, అతి త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఓ స్పష్టత రానుందని సమాచారం. మరి… చిరంజీవి సరసన రాశీ ఖన్నా, మాళవికాలకు హీరోయిన్లుగా నటించే చాన్స్‌ లభిస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

మాళవికా మోహనన్ ఇతర ప్రాజెక్టులు

మరోవైపు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు మాళవికా మోహనన్‌. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ది కుమార్‌ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా  జనవరి 9న విడుదల కానుంది.

చిరంజీవి 158వ సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా నటించనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. చిత్రబృందం త్వరలో అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.