
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్న మాళవిక మోహనన్.
- దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాపులారిటీని కాకుండా నటీమణుల ప్రత్యేకతను చూస్తారని వ్యాఖ్య.
- ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో ‘సలార్’ ఛాన్స్ మిస్ అవ్వడంపై నిరాశ, కానీ విధి నిర్ణయంగా భావించింది.
- చివరకు ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’లో నటించే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని వెల్లడి.
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ త్వరలో ‘ది రాజా సాబ్’తో టాలీవుడ్‌లో ప్రభాస్ సరసన అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌తో ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో సంచలన విషయాలు పంచుకుంది.
సందీప్ రెడ్డి వంగా గురించి మాళవిక ఏమన్నారంటే..
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab)ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ చిత్రంలో యోగిబాబు, సంజయ్ దత్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ (Nidhi Agarwal)కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ హడావిడి, ట్రెండ్ లేదా పాపులారిటీని నమ్మరని, నటీమణుల్లో ఉన్న ప్రత్యేకతనే ప్రధానంగా చూస్తారని తెలిపింది.
ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో మిస్సైన అవకాశం!
అందుకే కియారా అద్వానీని ఆమె కెరీర్‌లో ఒక కీలక దశలో ఎంపిక చేశారని, అదే తరహాలో త్రిప్తి డిమ్రీకి కూడా పెద్ద అవకాశం ఇచ్చారని పేర్కొంది. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. ‘మాస్టర్’ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత, ప్రభాస్‌తో తెరకెక్కుతున్న ‘సలార్’ కోసం తనకు స్వయంగా కాల్ వచ్చిందని మాళవిక వెల్లడించింది. ప్రాజెక్ట్ విషయంలో చర్చలు సానుకూలంగానే సాగాయని, అన్నీ బాగానే అనిపించినా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం ఫైనల్ కాలేదని చెప్పింది. అప్పట్లో ఆ ఛాన్స్ మిస్ కావడం కొంత నిరాశ కలిగించినా, దానిని విధి నిర్ణయంగా తీసుకున్నానని తెలిపింది.
‘ది రాజా సాబ్’తో డెబ్యూపై ఆనందం
అయితే ఇప్పుడు అదే ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’లో నటించే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందని మాళవిక చెప్పింది. అంతేకాదు, ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్‌తో సినిమా చేస్తున్న సమయంలో తనను కలవాలని అనుకున్నారని, ఫోటోషూట్ కోసం కాదు కానీ వ్యక్తిగతంగా కొన్ని ఫోటోలు తీయాలనే ఆలోచన ఆయనకు ఉందని వెల్లడించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భేటీ జరగలేదని తెలిపింది. ఇండస్ట్రీలో అవకాశాలు, టైమింగ్, పరిస్థితులు ఎంత కీలకమో తన ప్రయాణమే ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మాళవిక మోహనన్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అవకాశాలు, టైమింగ్ కీలకమని తెలిపిన ఆమె, చివరకు ‘ది రాజా సాబ్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.


