|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movie: మలయాళ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో రిలీజ్

Updated: 26-05-2025, 10:04 AM
OTT Movie: మలయాళ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో రిలీజ్

ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ‘లవ్ డేల్’ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఊటీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని మర్మమైన హత్యలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి.

Key Points

1

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ 'లవ్ డేల్' ఓటీటీలోకి!

2

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో సహా అనేక భాషల్లో స్ట్రీమింగ్

4

ఓ బంగ్లాలో ఉంటున్న స్నేహితుల బృందంపై మర్మమైన హత్యలు!

‘లవ్ డేల్’ సినిమా కథాంశం

ఈ వీకెండ్ ఓటీటీల్లో దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజయ్యాయి. మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ అయ‍్యాయి. అలాంటి వాటిలో ‘లవ్ డేల్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి. పేరుకే మలయాళ సినిమా అయినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో రిలీజైంది?

ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు

ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ డేల్’. కాస్త హారర్ టచ్ ఇచ్చిన ఈ మూవీలో అందరూ కొత్త నటీనటులే ఉండటంతో ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూకేలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రానుంది. ‘లవ్ డేల్’ అనేది ఊటీలోని ఓ ఊరి పేరు. ఈ మూవీ విషయానికొస్తే మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయి.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఊరికి వస్తుంది. ఓ బంగ్లాలో వీళ్లంతా ఉంటారు. కానీ ఓ రోజు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంతకీ వీళ్లని చంపుతున్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

సినిమా ప్రత్యేకతలు

మొత్తంగా ‘లవ్ డేల్’ సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. అమెజాన్ ప్రైమ్ లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.