
మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘వడక్కన్’ ఒకే రోజు రెండు ఓటీటీలలో విడుదలైంది. కాంతార కిషోర్, శృతి మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం.
Key Points
ఒకే రోజు రెండు ఓటీటీల్లో విడుదలైన మలయాళం మిస్టరీ థ్రిల్లర్.
ఐఎమ్‌డీబీలో 9.1 అద్భుతమైన రేటింగ్ సాధించింది.
కాంతార కిషోర్, శృతి మీనన్, మెర్లిన్ ఫిలిప్ నటనతో అలరించింది.
అనూహ్యమైన క్లైమాక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వడక్కన్: ఒకే రోజు రెండు ఓటీటీల్లో విడుదల
మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వడక్కన్ ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైనా ప్లే ఓటీటీ లో ఈ మూవీ రిలీజైంది. ఈ మలయాళం మూవీలో కాంతార కిషోర్ తో పాటు శృతి మీనన్, మెర్లిన్ ఫిలిప్, మీనాక్షి ఉన్ని కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు.
సాజీద్ దర్శకత్వం వహించిన ఈ మలయాళం మూవీకి ఆస్కార్ విన్నర్ రసూల్ పొకుట్టి సౌండ్ డిజైనర్‌గా పనిచేశాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నకారా కెమెరామెన్‌గా పనిచేసింది. మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన వడక్కన్ మూవీ టెక్నికల్‌గా మంచి మూవీగా ప్రేక్షకులను మెప్పించింది.
సౌండ్ డిజైనింగ్, విజువల్స్ పరంగా మలయాళం లో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్ మరియు ప్రేక్షకుల స్పందన
ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
రామ్ (కిషోర్) వరల్డ్‌లోనే నంబర్ వన్ పారా నార్మల్ సైకలాజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఓ రోజు మాజీ ప్రియురాలు మేఘా రామ్‌కు ఫోన్ చేస్తుంది. రియాలిటీ షో షూటింగ్ కోసం అడవికి వెళ్లిన తన భర్తతో పాటు అతడి స్నేహితులు కనిపించకుండా పోయారని, వారికి ఏమైందో కనిపెట్టడంతో తనకు సాయం చేయమని రామ్‌ను మేఘా అడుగుతుంది.
మేఘా భర్త కోసం అన్వేషిస్తూ అడవిలోని పాతకాలం నాటి ఇంట్లో అడుగుపెట్టిన రామ్, మేఘాలకు అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? నాలుగు వందల ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఆ ఐలాండ్ మిస్టరీని రామ్ ఎలా ఛేదించాడు? మేఘా భర్తతో పాటు అతడి స్నేహితులు కనిపించకుండా పోవటానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
కథ, నటీనటులు మరియు టెక్నికల్ విశేషాలు
టెక్నికల్‌గా బాగున్నా తాను అనుకున్న కథను చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడనే విమర్శలొచ్చాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నెవర్ బిఫోర్ అంటూ ఆడియెన్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ మూవీకి బిజిబాల్ అందించిన మ్యూజిక్ ప్లస్సయ్యింది.
కన్నడ నటుడు అయిన కిషోర్ తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ హ్యాపీ మూవీతో విలన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కిషోర్. కృష్ణం వందే జగద్గురుమ్, కార్తికేయ, పీఎస్‌వీ గురడవేగ, ఆచార్యతో పాటు మరికొన్ని సినిమాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా కనిపించాడు. తెలుగు, కన్నడంలోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేశాడు.
వడక్కన్ మూవీ టెక్నికల్‌గా అద్భుతంగా ఉన్నప్పటికీ, కథలో కొంత గందరగోళం ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మొత్తంమీద, ఒకసారి చూడదగిన మంచి మిస్టరీ థ్రిల్లర్.


