
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన హారర్ కామెడీ సినిమా ‘సుమతి వలవు’ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రోడ్డు మలుపులో కాపు కాసే తమిళ దెయ్యం కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
Key Points
మలయాళ సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా 'సుమతి వలవు' ఓటీటీలోకి!
రోడ్డు మలుపులో కాపు కాసే తమిళ దెయ్యం కథాంశం!
జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్!
₹25 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు!
సుమతి వలవు: ఓటీటీ విడుదల తేదీ
మలయాళం హారర్ కామెడీ మూవీ సుమతి వలవు (Sumathi Valavu) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓ రోడ్డు మలుపును కాపు కాసే తమిళ దెయ్యం అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు జీ5 ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది.
మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు సుమతి వలవు. అంటే సుమతి మలుపు అని అర్థం. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. మూవీ డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మూవీని సెప్టెంబర్ 26 నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
కథాంశం: తమిళ దెయ్యం
ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకుపైగా వసూలు చేసింది. మలయాళం ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద మొత్తమే. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ సినిమాలకు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
సుమతి వలవు అనే ఈ సినిమాన విష్ణు శశి శంకర్ డైరెక్ట్ చేశాడు. ఇందులో అర్జున్ అశోకన్ తోపాటు గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, మాళవిక మనోజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా దెయ్యంగా మారిన సుమతి అనే తమిళ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. రోడ్డుపై ఓ మలుపులో ఆమె చనిపోగా అక్కడే తిష్ట వేస్తుంది.
బాక్స్ ఆఫీస్ విజయం
దీంతో అక్కడికి వచ్చిన వారికి అతీత శక్తుల ముప్పు ఉంటుంది. ఈ హారర్ పాయింట్ కు కామెడీని జోడించి సుమతి వలవు సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. స్థానిక జానపద కథలు, నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉన్న మైలమూడులో ఇదే పేరుతో ఓ ప్లేస్ ఉండటం విశేషం.
ఆ ప్రదేశంలో 1950ల్లో ప్రెగ్నెంట్ గా ఉన్న సుమతి అనే అమ్మాయి హత్యకు గురైనట్లుగా చెబుతారు. అప్పటి నుంచీ ఆ ప్రదేశంలో సుమతి ఆత్మ ఉందని స్థానికులు నమ్ముతారు. ఆ తర్వాతి కాలంలో కూడా అక్కడ అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దీంతో అదే స్టోరీతో సుమతి వలవు సినిమాను తీశారు. మరి సెప్టెంబర్ 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సుమతి వలవు సినిమా ఓటీటీ రిలీజ్‌తో మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. జీ5 లో ఈ సినిమా ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.


