
గతేడాది విడుదలైన మలయాళ థ్రిల్లర్ ‘ఫుటేజ్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పొరుగింటి మహిళ మిస్టరీని ఛేదించే జంట కథను ఈ సినిమా చూపుతుంది. ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్ కూడా నటించింది.
Key Points
మలయాళ థ్రిల్లర్ 'ఫుటేజ్' సినిమా ఏడాది తర్వాత ఓటీటీలోకి
పొరుగింటి మహిళ మిస్టరీని ఛేదించే జంట కథ
సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
‘ఫుటేజ్’ సినిమా ఓటీటీ ప్రయాణం
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా వస్తూనే ఉంటుంది. అలా గతేడాది ఆగస్టులో వచ్చిన సినిమా ఫుటేజ్ (Footage). ఫౌండ్ ఫుటేజ్ ఆధారంగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తొలి మూవీ ఇది. అయితే ఏడాది తర్వాత ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.
మలయాళం సీనియర్ నటి మంజు వారియర్ నటించిన సినిమా ఫుటేజ్. ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓనమ్ సందర్భంగా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం (ఆగస్టు 29) వెల్లడించింది.
పొరుగింటి మిస్టరీ & థ్రిల్లింగ్ టర్న్
“లెన్స్ నుంచి చూస్తే ఏదీ దాగి ఉండలేదు. మీరు కేవలం చూడం లేదు.. మీరు నిఘా పెడుతున్నారు. దానిని సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన పోస్టర్ పై.. “రికార్డు చేసిన ప్రతిదీ చూడటానికి కాదు.. ఓనమ్ స్పెషల్ ఫుటేజ్ సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ లో” అని రాసి ఉంది.
ఫుటేజ్ మూవీని కొవిడ్ 19 మహమ్మారి సమయంలో జరిగిన కథగా తెరకెక్కించారు. ఇది వ్లోగర్స్ అయిన ఓ జంట చుట్టూ తిరుగుతుంది. విశాక్, గాయత్రి ఈ పాత్రల్లో నటించారు. వాళ్లు తమ పొరుగింటి మహిళ మిస్టరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. రికార్డు చేసిన ఓ ఫుటేజ్ వాళ్లు చూస్తారు. అది కాస్తా కథను థ్రిల్లింగ్ టర్న్ తీసుకునేలా చేస్తుంది. ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వాళ్లు ఓ అడవిలో ఉన్న ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్లు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ.
ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్ & కథాంశం
ఈ సినిమాను ఓ ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్లో చూపించారు. ఆ జంట కెమెరాకు చిక్కిన రికార్డింగులను మన ముందు ప్లే చేస్తున్నట్లుగా సినిమా సాగుతుంది. ఫస్టాఫ్ భర్త కెమెరాలోని రికార్డులు చూపించగా.. సెకండాఫ్ భార్య కెమెరాలోని రికార్డింగ్ చూపిస్తారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఐఎండీబీలో కేవలం 4.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
చివరగా, ‘ఫుటేజ్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆశిద్దాం.


