
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ‘మాలిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వైల్డ్ పోస్టర్ మరియు టీజర్ ఇటీవల విడుదల అయ్యాయి. రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రాజ్ కుమార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
Key Points
రాజ్‌కుమార్ రావు ‘మాలిక్’ లో రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు.
సినిమా యొక్క వైల్డ్ పోస్టర్ మరియు టీజర్ విడుదల అయ్యాయి.
1988 అలహాబాద్ నేపథ్యంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ సాగుతుంది.
జూలై 11న ‘మాలిక్’ థియేటర్లలో విడుదల కానుంది.
‘మాలిక్’ టీజర్ విడుదల
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao) గత ఏడాది ‘స్త్రీ-2’(Stree 2) సినిమాతో ఘన విజయం సాధించారు. ఇక ఇటీవల వామికా గబ్బితో కలిసి నటించిన ‘భూల్ చుక్ మాఫ్’(Bhool Chuk Maaf) పలు వివాదాల మధ్య మే23న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రాజ్ కుమార్ వరుస ప్రాజెక్ట్ ప్రకటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన ‘మాలిక్’(Malik) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు పుల్‌కిత్ దర్శకత్వం వహిస్తుండగా.. టిప్స్ ఫిల్మ్స్, లైట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కుమార్ తరుణి, జై శవక్రమణి, నిర్మిస్తు్న్నారు.
రాజ్ కుమార్ రావు యొక్క రూత్‌లెస్ పాత్ర
ఇందులో రాజ్ కుమార్ రావు రూత్ లెస్ అంటే మొరటుతనం స్వభావం గల గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హుమా ఖురేషి కూడా ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రం జూలై 11న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మాలిక్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో రాజ్ కుమార్ రావు పెద్ద గన్ పట్టుకుని అందరినీ పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తారు. 1988 అలహాబాద్ నేపథ్యంలో సాగే ఈ టీజర్ ప్రేక్షకులకు వణుకు పుట్టేలా చేస్తోంది. ఇందులో హీరో వైల్డ్ లుక్‌లో కనిపించడంతో నెటిజన్లకు భారీ అంచనాలు పెరిగిపోయాయి.
సినిమా విడుదల తేదీ
Maalik – Teaser- Video Credits to Tips Films You Tube Channel
‘మాలిక్’ సినిమా పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్ కుమార్ రావు నటనకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 11న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధమైన విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


