
జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా వస్తుంది. తేజ సజ్జా, ఉదయ భాను, సత్యరాజ్ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జాబిలమ్మ సినిమా టీవీ ప్రీమియర్ కూడా ఉంది.
Key Points
డ్రామా జూనియర్స్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం.
తేజ సజ్జా, ఉదయ భాను, సత్యరాజ్ వంటి ప్రముఖులు అతిథులుగా.
శనివారం, ఆదివారం జీ తెలుగులో ప్రత్యేక ప్రసారం.
డ్రామా జూనియర్స్ గ్రాండ్ ఫినాలే విశేషాలు
తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్‌స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది.
ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాని టీవీ ప్రీమియర్ చేయనుంది జీ తెలుగు.
డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఆగస్టు 9 శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అలాగే, రొమాంటిక్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా ఆదివారం (ఆగస్టు 10) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టెలీకాస్ట్ కానుంది.
ప్రముఖ అతిథుల సందడి
జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఆరంభం నుంచి అంతులేని వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. 8 సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది.
ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో లాస్య, ఆషిక పదుకొనె.. గర్ల్స్, బాయ్స్ టీమ్స్‌కి మెంటర్లుగా వ్యవహరించారు. ఇక, ఈ సీజన్‌కి సినీ ప్రముఖులు డెరెక్టర్ అనిల్ రావిపూడి, నటి ఆర్కే రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు.
జాబిలమ్మ నీకు అంత కోపమా టీవీ ప్రీమియర్
ఈ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఎపిసోడ్ కూడా యాంకర్, జడ్జీలు, కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. అంతేకాదు ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథులుగా హీరో తేజ సజ్జా, యాంకర్ ఉదయ భాను , నటుడు సత్యరాజ్ , మెగా డాటర్ కొణిదెల సుస్మిత వంటి సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు.
ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆగస్టు 09న మొదటి భాగం, ఆగస్టు 16న రెండవ భాగం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నాయి. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ శనివారం, వచ్చే శనివారం ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ తప్పకుండా చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు.
డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే చూసి వినోదాన్ని ఆస్వాదించండి. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ రెండు భాగాలను మిస్ చేసుకోకండి!


