|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Malvika Raaj: బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్!

Published: 25-08-2025, 7:36 AM
Malvika Raaj: బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్!

ప్రముఖ బాలీవుడ్ నటి మాళవిక రాజ్ తాజాగా తల్లి అయ్యింది. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ చిత్రంతో గుర్తింపు పొందిన ఈ నటి 2023లో ప్రణవ్ బగ్గాను వివాహం చేసుకుంది.

Key Points

1

మాళవిక రాజ్ తల్లి అయ్యింది.

2

సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకుంది.

4

'కభీ ఖుషీ కభీ ఘమ్', 'స్క్వాడ్', 'జయదేవ్' వంటి చిత్రాల్లో నటించింది.

మాళవిక రాజ్‌కు బిడ్డ

ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్‌ అభిమానులకు గుడ్ ‌ న్యూస్ చెప్పింది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది . 2023 లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడిన ముద్దుగుమ్మ .. ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించిన విషయాన్ని రివీల్ చేసింది . తాజాగా తమకు పాప పుట్టిందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు .

కాగా.. 2001 లో బాలీవుడ్‌లో హిట్ ‌ అయిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది మాల్వికా రాజ్‌ . అంతేకాకుండా రింజిన్ డెంజోంగ్పాతో కలిసి ‘స్క్వాడ్’ అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడిన మాల్వికా రాజ్ కొన్ని నెలల డేటింగ్‌ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలోని బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలకు పలువురు సినీతారలు హాజరయ్యారు. తెలుగులో ‘జయదేవ్’ ‍ అనే చిత్రంలో కనిపించింది . ఇటీవలే క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ ‘స్వైప్ క్రైమ్’లోనూ నటించింది .

సోషల్ మీడియా పోస్ట్

వృత్తి జీవితం

చివరగా, మాళవిక రాజ్ జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లిగా ఆమె జీవితం మరింత సంతోషంగా ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.