
📌 Key Points
- మమితా బైజు ‘ప్రేమలు’ సినిమాతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించింది.
- లవ్ ప్రపోజల్స్ పెరగడంతో వాటి బాధ్యతను అన్నయ్య మిథున్‌కు అప్పగించింది.
- అన్నయ్య మిథున్‌తో అన్నాచెల్లెళ్ల కంటే ఫ్రెండ్‌షిప్ ఎక్కువ అంటున్న మమిత.
- తన పెళ్లి, జీవిత నిర్ణయాలు అన్నీ అన్నయ్యే తీసుకుంటాడని స్పష్టం చేసింది.
‘ప్రేమలు’ సినిమాతో పాపులారిటీ పొందిన మలయాళీ నటి మమితా బైజు, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన లవ్ ప్రపోజల్స్, జీవిత నిర్ణయాలతో పాటు పెళ్లి గురించి కూడా అన్నయ్యే చూసుకుంటారని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమలు తర్వాత పెరిగిన ప్రపోజల్స్
మలయాళ తార మమితాబైజు(Mamitha Baiju) ‘ప్రేమలు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనూ ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. క్రేజ్‌తో పాటు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అయితే ఈ అమ్మడుకి క్రేజ్‌తో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయట.
అన్నయ్యే నా అన్ని విషయాలు చూసుకుంటాడు
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత బైజు ఈ విషయాలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రేమలు సినిమా హిట్ అయినప్పటి నుంచి లవ్ ప్రపోజల్స్ రావడం బాగా ఎక్కువయ్యాయి. కొందరైతే నా ఫోన్ నంబర్ కనుక్కుని మరీ మెసేజ్‌లు చేస్తున్నారు. నాకు మాత్రం వాటిని చదవడానికి టైమ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదు. అందుకే ఆ బాధ్యలన్నీ నేను మా అన్నయ్య మిథున్(Mithun)కు ఇచ్చాను. అతను స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్.. మా మధ్య అన్నాచెల్లెళ్ల రిలేషన్ కంటే ఫ్రెండ్‌షిప్ ఎక్కువ. అందుకే నాకు వచ్చే మెసేజ్‌లు అన్ని మా అన్నయ్య చూసి వాటిని తగినట్లుగా రిప్లై ఇస్తాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కూడా తాను కౌంటర్లు వేస్తాడు.
నా పెళ్లి నిర్ణయం కూడా అన్నయ్యదే
నేను నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అన్నయ్యను అడగకుండా డిసైడ్ అవ్వను. ప్రతి విషయంలో మిథున్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. చివరకు నా పెళ్లి ఎవరితో జరగాలి? ఎప్పుడు జరగాలి అనేది కూడా మా అన్నయ్యే ఫిక్స్ చేస్తాడు. అతను ఎవరిని చేసుకోమంటే అతన్ని చేసుకుంటాను’’ అని తన అన్నయ్యపై తనకున్న నమ్మకాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మమితా బైజు తన జీవిత నిర్ణయాలు, ప్రేమ, పెళ్లి విషయంలో తన అన్నయ్య మిథున్‌పై పూర్తి నమ్మకాన్ని ఈ విధంగా వ్యక్తం చేసింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


