
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ టికెట్ల పెంపుకు తెలంగాణ సర్కార్ అనుమతి! అభిమానుల్లో ఆనందం.
- ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపు!
- ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి, స్పెషల్ షో టికెట్ ధర రూ.500 నిర్ణయం!
- జనవరి 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం, రోజుకు 5 షోల వరకు అనుమతి!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు అనుమతి!
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రం (Mana Shankara Vara Prasad Garu)సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక రోజు ముందుగానే అంటే జనవరి 11న స్పెషల్ ప్రీమియర్లు వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ టికెట్ ధరల పెంపు!
ఇక ఈ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించింది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.50(జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.
ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే…?
ఏపీలోనూ.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. స్పెషల్ షో టికెట్ ధరను 500 రూపాయలు ఖరారు చేయగా.. జనవరి 12 నుంచి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోల వరకు అనుమతి ఇచ్చారు.
చిరంజీవి గారి సినిమా టికెట్ ధరల పెంపుతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


