
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట, చిరు గ్రేస్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Key Points
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూపొందుతోంది.
నయనతార, క్యాథరిన్ త్రెసా హీరోయిన్స్ కాగా, వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి 'మీసాల పిల్ల' అనే మొదటి సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
ఉదిత్ నారాయణ ఆలపించిన ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ విశేషాలు
Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార, క్యాథరిన్ త్రెసా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగనుంది.
ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. మీసాల పిల్ల.. అని సాగనుంది ఈ పాట. ఈ పాటని భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో ఒకప్పుడు మెగాస్టార్ కి గంగూలీ సందులో గజ్జెల గోల, కైకలూరు కన్నెపిల్ల, వాన వాన.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ పాడటం గమనార్హం.
మొదటి సాంగ్ ప్రోమో: “మీసాల పిల్ల”
Also See : Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..
ఉదిత్ నారాయణ్ గాత్రంలో మళ్ళీ మ్యాజిక్
మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మొదటి సాంగ్ ప్రోమో వినేయండి..
మొత్తంగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి విడుదలైన ఈ మొదటి సాంగ్ ప్రోమో సినిమాపై అంచనాలను పెంచింది. చిరంజీవి అభిమానులను అలరించేలా ఈ పాట ఉండటంతో, సినిమాపై హైప్ మరింత పెరిగింది.


