|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి విశ్వరూపం: మూడు రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల సునామీ!

Updated: 15-01-2026, 12:33 AM
చిరంజీవి విశ్వరూపం: మూడు రోజుల్లో 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల సునామీ! రికార్డులు బద్దలు!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్!
  • మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్స్: మన శంకర వరప్రసాద్ గారు మూవీ 152 కోట్ల గ్రాస్ వసూళ్లు!
  • చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్: మొదటి రోజు ఏకంగా 84 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
  • ఫ్యామిలీస్ ఫస్ట్ ఛాయిస్: మన శంకర వరప్రసాద్ గారు మూవీకి థియేటర్ల వద్ద భారీగా ప్రేక్షకాదరణ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తుంది. ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ విజయం వైపు దూసుకుపోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ఫ్యామిలీస్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది. సింగిల్ స్క్రీన్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి.(Mana Shankara Varaprasad Garu)

ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆమోదటి రోజు ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరు కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మూడు రోజుల్లో 152 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మూడు రోజుల్లో 152 కోట్ల గ్రాస్ వసూళ్లు

ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. సంక్రాంతి పండగ హాలిడేస్ ఇంకా ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో ఈజీగా ఈ కలెక్షన్స్ వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.