
📌 Key Points
- మన శంకర వరప్రసాద్ గారు మూవీ: థియేటర్లలో రూ.350 కోట్ల భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్!
- నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్!
- జీ గ్రూప్ డిజిటల్ హక్కులను రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది, భారీ అంచనాలతో ఓటీటీలోకి చిత్రం.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంచలనం!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. అలా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ గ్రూప్ 50 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?
థియేటర్‌లో రిలీజైన 4 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలనే ఒప్పందం మీద డీల్ కుదిరింది. దీని ప్రకారం ఫిబ్రవరి 11న మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ మూవీ ఓటీటీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.
డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన జీ గ్రూప్!
A post shared by Filmyfigures (@filmyfigures)
మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


