|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“మన శంకర వరప్రసాద్ గారు” అదిరిపోయే అప్డేట్: చిరంజీవి-వెంకటేష్ మాస్ సాంగ్ వచ్చేస్తోంది!

Published: 29-12-2025, 8:22 AM
"మన శంకర వరప్రసాద్ గారు" అదిరిపోయే అప్డేట్: చిరంజీవి-వెంకటేష్ మాస్ సాంగ్ వచ్చేస్తోంది!
  • “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో, నయనతార హీరోయిన్.
  • విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
  • చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో ఒక ఊర మాస్ సాంగ్ ఉండనుంది.
  • ఈ మాస్ సాంగ్ డిసెంబర్ 30న గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో విడుదల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని చిరంజీవి, వెంకటేష్ కాంబో మాస్ సాంగ్‌ను డిసెంబర్ 30న గుంటూరులో భారీ ఈవెంట్‌తో విడుదల చేయనున్నారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

“మన శంకర వరప్రసాద్ గారు” నుంచి కీలక అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తుండగా, హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

ఈ మూవీలో చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మాస్ సాంగ్ ఉంటుందట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అయితే ఈ పాటను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్డేట్ వచ్చేసింది. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ వదిలింది. ఈ ఊర మాస్ సాంగ్ ను గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్ కు సినిమాలో నటించిన వాళ్లందరూ హాజరు అవుతారట.

చిరు-వెంకటేష్ కాంబో మాస్ సాంగ్ విశేషాలు

గుంటూరులో గ్రాండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ వివరాలు

చిరంజీవి, వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఊర మాస్ సాంగ్ విడుదల ఈవెంట్ గుంటూరులో అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుండటంతో అందరూ వీక్షించవచ్చు. సినిమాపై అంచనాలు మరింత పెంచింది ఈ అప్డేట్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.