
📌 Key Points
- మంచు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి గొడవలు జరిగాయని సమాచారం.
- మంచు లక్ష్మి కూతురు ఓణీ ఫంక్షన్‌కు హాజరైన కుటుంబ సభ్యులు.
- ఫంక్షన్‌లో కలిసి ఫోటోలకు ఫోజులివ్వని మంచు బ్రదర్స్!
- కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఇంకా తొలగలేదని నెటిజన్ల అభిప్రాయం.
మంచు ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు రేగింది! మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? విభేదాలు మళ్లీ మొదటికి వచ్చాయా?
మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు?
మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో వీరిద్దరూ రోడ్డు మీదకు వచ్చి కొట్టుకోవడమే కాకుండా, పోలీసుల వరకు కూడా వెళ్లారు. ఆస్తుల గొడవలతో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గొడవలన్నీ సర్దుమణిగాయని అందరూ అనుకునేలా ఒక వార్త బయటకు వచ్చింది. మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ ఫంక్షన్ హైదరాబాద్‌లో చాలా ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తండ్రి మోహన్ బాబుతో పాటు, తమ్ముళ్లు విష్ణు, మనోజ్ తమ భార్యాపిల్లలతో కలిసి హాజరయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా ఒక్కటేనని చాటిచెప్పేలా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.
కలిసున్న ఫోటో ఒక్కటీ లేదేం?
అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఫంక్షన్‌కు అందరూ వచ్చారు కానీ, అందరూ కలిసున్న ఒక్క ఫోటో కూడా లేదు. విద్యా నిర్వాణకు నలుగు పెట్టే సమయంలో తీసిన ఫోటోల్లో మంచు మనోజ్ కుటుంబం కనిపించలేదు. అలాగే, ఇతర వేడుక ఫోటోల్లో విష్ణు, మోహన్ బాబు కుటుంబాలు కనిపించకపోవడం గమనార్హం. దీంతో, అక్క కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే చోటుకు వచ్చారు కానీ.. ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదని, కలిసున్న ఫోటోలకు కూడా ఇష్టపడలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గొడవలు తగ్గినట్టు కనిపిస్తున్నా, మనసులు మాత్రం ఇంకా కలవలేదని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోందని పలు రకాలుగా అనుకుంటున్నారు.
మనసులు కలవని బంధాలు!
A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)
మంచు ఫ్యామిలీ గొడవల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.


