|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒరెయ్.. నా ముందుకొచ్చి మాట్లాడురా.. ఎవడో వాడు.. సెన్స్ లేదు.. రాస్కెల్స్: ఫ్యాన్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి.. వీడియో

Published: 08-09-2025, 6:13 AM
ఒరెయ్.. నా ముందుకొచ్చి మాట్లాడురా.. ఎవడో వాడు.. సెన్స్ లేదు.. రాస్కెల్స్: ఫ్యాన్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి.. వీడియో

దుబాయ్‌లో జరిగిన సైమా 2025 కార్యక్రమంలో, నటి లక్ష్మీ మంచు కొంతమంది ఫ్యాన్స్‌తో గొడవపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ఆమె వారిపై మండిపడింది.

Key Points

1

దుబాయ్‌లోని సైమా 2025లో లక్ష్మీ మంచు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగారు.

2

కొంతమంది ఫ్యాన్స్‌తో ఆమె మాటామాటా జరిగింది.

4

తర్వాత ఆమె నవ్వుతూ సెల్ఫీలు దిగింది.

సైమా 2025లో లక్ష్మీ మంచు

ఈ వీకెండ్‌లో దుబాయ్‌లో జరిగిన సైమా 2025 కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. చాలా మంది నటీనటులు రెడ్ కార్పెట్‌పై వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్‌తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. లక్ష్మీ మంచు కూడా ఇలాగే ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగారు. అయితే ఈ సందర్భంగా తనను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ పై ఆమె మండిపడింది. వాళ్లను ఆమె తిడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు అక్కడ ఏం జరిగిందో చూడండి.

ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసిన వీడియోలో లక్ష్మీ మంచు రెడ్ డ్రెస్ లో ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. ఆ సమయంలో ఎవరో వెనుక నుంచి ఆమెను ఏదో అన్నారు. దీంతో సెల్ఫీ తీసుకోవడం ఆపేసి ఆమె వాళ్లపై మండిపడింది. “ఒరెయ్.. నా ముందు వచ్చి మాట్లాడురా, ఎవరు వాడు? టైం, సెన్స్ లేదు మీకు, రాస్కెల్స్” అని అనడం స్పష్టంగా వినిపించింది.

ఇక వాళ్లతో సెల్ఫీ దిగుతున్న సమయంలోనూ కొందరు సెల్ఫీ తీయడం రాదా అంటూ ఆటపట్టించారు. నాకు ఫొటో అడ్డం, నిలువు, రైట్ లెఫ్ట్ తెలియదని ఆమె అనడం విశేషం. ఆ తర్వాత ఆమె నవ్వుతూ వాళ్లతో సెల్ఫీలు దిగింది.

ఫ్యాన్స్‌తో మాటామాటా

ఆమెను ప్రేమగా ‘మంచు అక్క’ అని పిలుస్తున్న ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకున్న తర్వాత ఆమె వెళ్తుండగా ఇంకొంతమంది ఫ్యాన్స్ గట్టిగా అక్కా అని పిలుస్తూ ఆమెను ఆపారు. తనకు వాళ్ళు చెప్పింది వినిపించలేదని సైగ చేశారు. దాంతో వాళ్ళు ఆమె కోసం అరవడం మొదలుపెట్టారు. ఒక చిన్న పాపతో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఆమె పేరు కూడా అడిగింది. దారిలో చూసిన మరో పాప కోసం కూడా ఆగిపోయింది. వీడియో చివర్లో ముంబైలో కూడా తెలుగు ఫొటోగ్రాఫర్లు ఆమెను అక్కా అని పిలుస్తారని ఆమె చెప్పింది.

లక్ష్మీ మంచు రీసెంట్ మూవీస్

వైరల్ వీడియో

లక్ష్మీ మంచు రెండేళ్ల కిందట హైదరాబాద్ వదిలి ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. తెలుగు కాకుండా అక్కడి అవకాశాలను వెతుక్కుంటూ ఆమె తన కూతురుతో కలిసి వెళ్లింది. 2024లో వచ్చిన ఆదిపర్వం, ఇక జియోహాట్‌స్టార్ షో యక్షిణిలో నటించింది. ఈ ఏడాది ఆమె కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘ది ట్రైటర్స్ ఇండియా’ అనే ప్రైమ్ వీడియో షోలో ఒక కంటెస్టెంట్‌గా ఉంది. ఆమె మూడో ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయింది.

ముంబైకి వెళ్లడం గురించి గతంలో హిందుస్థాన్ టైమ్స్‌తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. “ముంబై నా హృదయాన్ని గెలుచుకుంది. ప్రతీ రోజు కొత్తగా ఉంటుంది. కొత్త మనుషులతో, సవాళ్లతో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఇది నన్ను రియాలిటీలో ఉంచింది. హైదరాబాద్ నా ఇల్లు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అక్కడి ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను. కానీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లి రెండు ప్రపంచాలను ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది.

చివరకు లక్ష్మీ మంచు నవ్వుతూ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగినప్పటికీ, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఫ్యాన్స్ ప్రవర్తన, సెలబ్రిటీలతో వ్యవహరించే విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.