|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.. మంచు మనోజ్ కామెంట్స్

Published: 01-06-2025, 9:15 PM
ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.. మంచు మనోజ్ కామెంట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో మంచు మనోజ్ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన గురించి ఆయన మాట్లాడారు.

Key Points

1

భైరవం సినిమాకు అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది.

2

మంచు మనోజ్ తన పాత్రను అద్భుతంగా పోషించారని ప్రేక్షకులు ప్రశంసించారు.

4

ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని మంచు మనోజ్ తెలిపారు.

భైరవం సినిమా విజయం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం . తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన భైరవంకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భారీగా నిర్మించారు.

మే 30న ప్రపంచవ్యాప్తంగా భైరవం సినిమా విడుదల అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన భైరవం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం భైరవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-ఈ సినిమాలో నా పర్ఫామెన్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇలాంటి కథ దొరికినప్పుడే మన పర్ఫామెన్స్‌కి స్కోప్ ఉంటుంది. అలాంటి కథ భైరవంతో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నాకు, నా కెరీర్‌లో మోఎస్ట్ మెమరబుల్ మూవీ.

మంచు మనోజ్ కామెంట్లు

-ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. చూసిన ప్రతి ఆడియన్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మా భైరవం థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్‌కి వెళ్లి మా సినిమాలు చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇది. మంచి హైతో ఆడియెన్స్ బయటకు వస్తారు.

-ఈ సినిమాకి చాలా మంచి టీమ్ కుదిరింది. విజయ్‌కి చాలా క్లారిటీ ఉంది. తనతో మాట్లాడి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చేయడం జరిగింది. నిజానికి నేను ఇంత మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ విజయ కారణంగానే అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ని ఇవ్వగలిగాను.

ప్రేక్షకుల స్పందన

-ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరు కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. మీరందరూ కూడా థియేటర్స్ వెళ్లి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

-ఒక్కటని చెప్పలేను. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యాను అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నా ఇంట్రడక్షన్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, అప్లోజ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అది చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను.

మొత్తంమీద, భైరవం సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. మంచు మనోజ్ వంటి నటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో చూడటానికి తప్పకుండా సిఫార్సు చేయదగిన చిత్రమిది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.