
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఆ ట్వీట్‌లో తన అన్నను ప్రస్తావించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
మంచు మనోజ్ తన అన్న విష్ణును ట్వీట్‌లో ప్రస్తావించడం మరచిపోయాడు.
మనోజ్ ట్వీట్ వైరల్ అవుతూ ప్రేక్షకులను నిరాశపరుస్తోంది.
అభిమానులు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కన్నప్ప సినిమా రిలీజ్‌కు సిద్ధం
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా గ్రాండ్ లెవల్‌లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కనిపించబోయే సినిమాపైనే ఆస్తి మొత్తం పెట్టేసింది మంచు ఫ్యామిలీ. ఫలితం అదిరిపోతుందనే ఆశతో ఉంది. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కాగా ఇన్ని రోజులు మోహన్ బాబు, విష్ణుతో కాస్త వివాదం జరిగినా.. మంచు మనోజ్ కూడా కన్నప్ప మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలంటూ ట్వీట్ పెట్టాడు.
ముందుగా తండ్రి మోహన్ బాబును, తర్వాత మంచు విష్ణు పిల్లలను.. తర్వాత మూవీకి పని చేసిన స్టార్స్ అందరినీ.. ఈ పోస్ట్‌లో ప్రస్తావించాడు మనోజ్. హృదయ పూర్వకంగా చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నాడు. పెద్ద నోట్ రాసుకొచ్చాడు. కానీ ఇందులో తన అన్న మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెప్పడం, ప్రేజ్ చేయడం కావాలనే మరిచిపోయాడు. దీంతో ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న జనాలు.. ఒక్కటి మరిచిపోయావ్ అన్న అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలా అయితే మీరు మళ్లీ కలవడం కష్టమే అంటూ బాధపడుతున్నారు అభిమానులు.
మనోజ్ ట్వీట్ వైరల్
అభిమానుల ఆందోళన
మంచు మనోజ్ ట్వీట్ వైరల్ కావడంతో అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి పనిచేయడం కష్టమేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


