|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Manoj: టాలీవుడ్‌లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. మంచు మనోజ్‌ కామెంట్స్!

Published: 09-07-2025, 7:49 AM
Manchu Manoj: టాలీవుడ్‌లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. మంచు మనోజ్‌ కామెంట్స్!

టాలీవుడ్‌లో నెపోటిజం చర్చ జోరుగా సాగుతున్న సమయంలో, మంచు మనోజ్ నెపోటిజంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘ఓ భామ అయ్యో రామా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Key Points

1

మంచు మనోజ్ టాలీవుడ్ లో నెపోటిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.

2

సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.

4

కష్టపడితేనే సినిమా విజయవంతం అవుతుందని మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు.

మంచు మనోజ్ నెపోటిజంపై కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం . ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది . ఈ పదానిరి అర్థం మరి సింపుల్ ‌ గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్‌గ్రౌండ్‌ అండతో స్టార్ ‌గా ఎదగడమే . ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్ ‌ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ .. ఎలాంటి బ్యాక్ ‌ గ్రౌండ్ ‌ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు . అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు . అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ‌ వైరలవుతున్నాయి .

సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ‌ ఈవెంట్ ‌ కు మంచు మనోజ్ మాట్లాడారు . యూట్యూబ్‌తో కెరీర్‌ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్ ‌ పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్ ‌ నే అని .. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు . అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు . దీనికి కౌంటర్ ‌ గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్ ‌ కామెంట్స్ చేస్తున్నారు .

‘ఓ భామ అయ్యో రామా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

కుటుంబ నేపథ్యం మరియు సినిమా విజయం

మంచు మనోజ్ మాట్లాడుతూ ..’ నేను కూడా నెప్టో కిడ్ ‌ నే . అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు . బ్యాక్ ‌ గ్రౌండ్ ‌ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్ ‌ అవుతుంది . నేను కూడా అలానే వచ్చా . నెప్టో కిడ్ ‌ గా చెబుతున్నా .. ఇక్కడ అలాంటివి పనిచేయవు . ఎవరైనా దేకాల్సిందే . ఒక సినిమా సక్సెస్ అనేది .. పెద్ద స్టార్ ‌ చేశారా ? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు .. సినిమా ఎప్పటికీ సినిమానే . మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది .’ అని అన్నారు . కాగా.. మాళవికా మనోజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రామ్‌ గోదాల డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.

చివరగా, మంచు మనోజ్ తన అనుభవాలను పంచుకుంటూ, కష్టపడటం ఒక్కటే విజయానికి మార్గమని స్పష్టం చేశారు. నెపోటిజం కంటే కృషి ముఖ్యమని ఆయన తెలియజేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.