
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న విడుదల కానున్న సందర్భంగా, ఆయన శ్రీశైల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పన్నెండు జ్యోతిర్లింగాల యాత్రను పూర్తి చేసుకున్న సంతోషాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
శ్రీశైల ఆలయంలో మంచు విష్ణు పూజలు నిర్వహించారు.
పన్నెండు జ్యోతిర్లింగాల యాత్రను మంచు విష్ణు పూర్తి చేసుకున్నారు.
'కన్నప్ప' చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.
శ్రీశైలంలో మంచు విష్ణు పూజలు
కన్నప్ప విడుదలకు ముందు మంచు విష్ణు శ్రీశైల ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు.
‘కన్నప్ప’ చిత్ర విడుదల
తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని మధుర క్షణాలను మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించినట్లు తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలు. ఒక ప్రయాణం. శాశ్వత శాంతి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నానంటూ ఫోటోలను షేర్ చేశారు.
పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర
ఈ సందర్శనతో పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం ముగింపునకు చేరుకుంది.. నా హృదయం నిండిపోయిందని.. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చారు. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతి తప్ప మరేమీ లేదని పోస్ట్ చేశారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం.. ఈ రోజు నేను మోస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కన్నప్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. . హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు.
పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనంతో ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందిన మంచు విష్ణు, తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నారు. జూన్ 27న విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.


