|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas : మొన్న కన్నప్ప.. ఇవాళ రాజాసాబ్.. పాపం అందుకే సినిమా వాయిదా.. డైరెక్టర్ నే బెదిరించాడట..

Published: 14-10-2025, 10:41 PM
Prabhas : మొన్న కన్నప్ప.. ఇవాళ రాజాసాబ్.. పాపం అందుకే సినిమా వాయిదా.. డైరెక్టర్ నే బెదిరించాడట..

ప్రభాస్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ, ఆయన చిత్రాలు వరుసగా VFX సమస్యల కారణంగా ఆలస్యం అవుతున్నాయి. ‘కన్నప్ప’ విషయంలో జరిగిన తప్పు ‘రాజాసాబ్’కూ ఎదురైంది. ఓ VFX సూపర్ వైజర్ పని పూర్తి చేయకుండా, డైరెక్టర్ మారుతిని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Key Points

1

VFX సమస్యలు ప్రభాస్ చిత్రాల నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నాయి.

2

'కన్నప్ప'కు ఎదురైన సమస్యలే ఇప్పుడు 'రాజాసాబ్'కు పునరావృతం.

4

ఈ సంఘటన కారణంగా సినిమా 2026 సంక్రాంతికి వాయిదా పడింది, నిర్మాతకు నష్టం వాటిల్లింది.

VFX సమస్యలతో ప్రభాస్ సినిమాల ఆలస్యం

Prabhas : ఇటీవల ప్రతి సినిమాకు VFX లేనిదే పని జరగట్లేదు. ఇక పెద్ద పెద్ద సినిమాలు, భారీ కథలు, విజువల్స్ ఉన్నవాటికి VFX ముఖ్యం. దీంతో VFX నిపుణులు సినిమా వాళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నారు అని టాక్ నడుస్తుంది. VFX కోసం ముంబై, లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడే VFX నిపుణులు పెరుగుతున్నారు.(Prabhas)

సినిమాల్లో VFX అవసరాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని క్యాష్ చేసుకోవడమే కాక సినిమాని పూర్తి చెయ్యట్లేదు కూడా. కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు కన్నప్ప సినిమాకు ఒక VFX సూపర్ వైజర్ డబ్బులు తీసుకొని పని చేయలేదు, కొన్ని లక్షలు నష్టం వచ్చింది, అందుకే సినిమా ఆలస్యం అయింది. తర్వాత అతన్ని తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నాము అని విష్ణు చెప్పాడు. ఆ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

‘కన్నప్ప’కు ఎదురైన పరిస్థితి ‘రాజాసాబ్’కూ!

అయితే ఇప్పుడు అదే పరిస్థితి ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా వచ్చింది. రాజాసాబ్ సినిమా గత సంవత్సరమే రావాల్సింది. అప్పట్నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. తాజాగా రాజాసాబ్ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్ ఏప్రిల్ 2025 లోనే రిలీజ్ అని పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. కానీ VFX వర్క్ అవ్వలేదు. VFX సూపర్ వైజర్ గా చేసిన వ్యక్తి పని పూర్తి చేయడమే కాక డబ్బులు తీసుకొని పని గురించి అడిగితే తప్పించుకొని తిరిగాడు. మేము గట్టిగా అడిగితే అసలు వర్క్ చేయను అని డైరెక్టర్ మారుతి దగ్గర బెదిరించాడట. అతని వల్లే సినిమా ఆలస్యం అయింది. ఆ తర్వాత అతన్ని తీసేసి ఇంకొకరికి ఆ VFX పని ఇచ్చాము. దాని వాళ్ళ మాకు కొన్ని లక్షలు నష్టం కూడా వచ్చింది అని తెలిపారు.

డైరెక్టర్ మారుతిని బెదిరించిన VFX సూపర్ వైజర్

ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరో సినిమాలకే ఇలాంటివి జరగాలా అప్పుడు కన్నప్ప, ఇప్పుడు రాజాసాబ్ అని ఫీల్ అవుతున్నారు. ఇక రాజాసాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

VFX నిపుణుల తీరు, సినిమా నిర్మాణంలో వారి ఆధిపత్యం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘రాజాసాబ్’ ఆలస్యానికి ప్రధాన కారణమైన ఈ సంఘటన, చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాకుండా, అభిమానులను నిరాశపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.