|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్‌ వైరల్!

Published: 26-06-2025, 1:15 PM
Manchu Vishnu: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్‌ వైరల్!

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, విష్ణు న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నారనే వార్తలపై స్పందించారు. ఆయన ప్రతిస్పందన వైరల్‌గా మారింది.

Key Points

1

మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

2

న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నారనే వార్తలపై విష్ణు స్పందించారు.

4

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మించిన సినిమా ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్‌ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

న్యూజిలాండ్‌లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ‘కన్నప్ప’లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.

7000 ఎకరాల వార్తలపై విష్ణు స్పందన

వైరల్ అయిన వీడియో

చివరగా, మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా న్యూజిలాండ్ భూమి కొనుగోలు వార్తలపై ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.