|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu – Prabhas : ప్రభాస్ కి నేను ఆఫర్ ఇచ్చా.. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు.. ఆ విషయంలో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాను..

Published: 04-06-2025, 6:53 AM
Manchu Vishnu – Prabhas : ప్రభాస్ కి నేను ఆఫర్ ఇచ్చా.. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు.. ఆ విషయంలో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టాను..

జూన్ 27న విడుదల కానున్న ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రభాస్‌కు పాత్ర ఆఫర్ చేసి, అతను ఎంచుకున్న విధానం, షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి వివరించారు.

Key Points

1

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్‌కు పాత్ర ఆఫర్ చేశారు.

2

ప్రభాస్ స్వయంగా 'రుద్ర' పాత్రను ఎంచుకున్నారు.

4

సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు అరగంట ఉంటుందని విష్ణు వెల్లడించారు.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర

Manchu Vishnu – Prabhas : మంచు విష్ణు భారీగా, స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. దీంతో మంచు విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో వీరందరిని చూపించారు.

ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ పాత్ర ఎంపిక

తాజాగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. నేను ప్రభాస్ కి ఆఫర్ ఇచ్చాను. కన్నప్ప సినిమాలో ఈ పాత్రలు ఉన్నాయని చెప్పి సినిమాలో ఉన్న పాత్రలన్నీ అతని ముందు పెట్టి సెలెక్ట్ చేసుకోమంటే తనే రుద్ర పాత్ర సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక నటుడిగా రుద్ర పాత్ర ప్రభాస్ కి ఒక మైలురాయిలా నిలిచిపోతుంది.

షూటింగ్ అనుభవం

షూటింగ్ అయ్యాక ప్రభాస్ నేను డైలాగ్స్ ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. డైలాగ్స్ విషయంలో ప్రభాస్ ని కొంత ఇబ్బందిపెట్టాను. పెద్ద పెద్ద డైలాగ్స్ ఇవ్వకు అన్నాడు కానీ కొన్ని పెద్ద డైలాగ్స్ ఇచ్చాను. ప్రభాస్ కోసం కొన్ని డైలాగ్స్ మార్చాను. ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా గౌరవించాలి. ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకూడదు. సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు అరగంట ఉంటుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది అని తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద, మంచు విష్ణు ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి, ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రాముఖ్యతను వివరించారు. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.