
మంచు ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో మంచు విష్ణు చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన తండ్రి మోహన్ బాబు గురించి ఆయన వెల్లడించిన విషయాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.
Key Points
మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు గురించి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
తన తండ్రికి చెడ్డపేరు రాకుండా చూసుకోవడమే తన లక్ష్యమని విష్ణు పేర్కొన్నాడు.
విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
మంచు ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మంచు విష్ణు యొక్క తాజా వ్యాఖ్యలు
Manchu Vishnu : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అంటూ ఈ వివాదాలు రోడ్డు మీదకు, మీడియా ముందుకు కూడా వచ్చాయి. ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ రెగ్యులర్ గా మీడియా ముందు కౌంటర్లు వేయడం, ఇండైరెక్ట్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడటం చేస్తున్నారు.
విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు విష్ణు.
మోహన్ బాబు పై విష్ణు ప్రేమ
మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇప్పుడు నా ఫోకస్ అంతా మా నాన్న గారు హ్యాపీగా ఉండాలి అంతే. ఆయన పడ్డ కష్టానికి నేను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు కానీ చెడ్డపేరు తీసుకురాకూడదు. ఆయనకి ఏ రోజైతే నేను చెడ్డ పేరు తీసుకొస్తానో ఒక కొడుకుగా నేను బ్రతికున్నా చచ్చినా ఒకటే. నేను బతికున్నంత వరకు మా నాన్నకు చెడ్డ పేరు తీసుకురాను. మా నాన్న లేకపోతే నేను లేను. మన అందరికి మన ఫాదర్స్ అంటే ఇష్టం. వాళ్ళు పడిన కష్టం, త్యాగాలు మనం తండ్రులం అయ్యాకే తెలుస్తుంది అని అన్నారు.
ఆయనకి ఏ రోజైతే నేను చెడ్డ పేరు తీసుకొస్తానో.. ఒక కొడుకుగా నేను బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే.
– #ManchuVishnu | #MohanBabu pic.twitter.com/c51dP6tKKl
విష్ణు కన్నప్ప ప్రమోషన్స్
— Whynot Cinemas (@whynotcinemass_) May 18, 2025
మంచు విష్ణు యొక్క ఈ వ్యాఖ్యలు సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తండ్రి పట్ల తనకున్న అంకితభావాన్ని విష్ణు ఈ మాటల ద్వారా చాటుకున్నాడు.


