
కోలీవుడ్ నటుడు సూరి మరియు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ‘మండాడి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో సూరి, సుహాస్ గుబురు గడ్డంతో ఆగ్రహంగా కనిపిస్తున్నారు. ఈ లుక్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
Key Points
‘మండాడి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
సూరి మరియు సుహాస్ షాకింగ్ లుక్‌లో కనిపించారు.
సముద్రం నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న హీరోల లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
‘మండాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ నటుడు సూరి(suri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక హీరోగా మారిన సూరి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘మామన్’ మూవీలో నటిస్తున్న ఆయన ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. దీంతో పాటు ‘మండాడి’(Mandaadi )లోనూ నటిస్తున్నాడు. దీనికి ‘సెల్షి’ చిత్రం ఫేమ్ మతిమారన్ పుగళేంది(mathimaran pugazhendhi) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
సూరి మరియు సుహాస్ షాకింగ్ లుక్
తాజాగా, మూవీ మేకర్స్ ‘మండాడి’ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో సురితో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కూడా ఉన్నాడు. వీరిద్దరు గుబురు గడ్డం జుట్టుతో సముద్రంలో ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ కనిపించిన లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో సుహాస్ వేసుకున్న టీషర్ట్‌పై సునామీ రైడర్స్ అని రాసి ఉంది. ఇక ఈ పోస్టర్‌కు ‘‘మీ పోరాట స్ఫూర్తిని మేల్కొల్పడానికి ఒక సునామీ చాలు. ‘మండాడి’ సినిమా అద్భుతమైన తెలుగు ఫస్ట్ లుక్ ఇదిగో. సముద్రాన్ని పాలించడానికి సూరి, సుహాస్ సిద్ధంగా ఉన్నారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఉత్కంఠభరితమైన యాక్షన్ డ్రామా
A post shared by RS Infotainment (@rsinfotainment)
‘మండాడి’ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సూరి, సుహాస్ కాంబినేషన్‌తో ఈ చిత్రం విజయవంతం అవుతుందని అంచనా. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.


