
📌 Key Points
- మంగ్లీ పాడిన ‘బావిలోనే బల్లి పలికే’ పాట యూట్యూబ్‌లో అత్యంత ట్రెండింగ్.
- నెల రోజుల్లోనే ఈ పాట 60 మిలియన్లకు పైగా వ్యూవ్స్ సాధించి సంచలనం సృష్టించింది.
- ‘నౌర మజా దారుద్యా’ అనే బిహారీ జానపద పాట నుండి కాపీ చేశారనే ఆరోపణలు.
- రెండు పాటల సంగీతం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ.
మంగ్లీ పాడిన “బావిలోనే బల్లి పలికే” పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ జానపద పాటల ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ఈ పాట విస్తృతంగా ప్రజాదరణ పొందింది. అయితే, ఇది ఓ బిహారీ పాట నుండి కాపీ చేయబడిందని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
యూట్యూబ్‌లో మంగ్లీ పాటల సంచలనం
ఈ మధ్య తెలంగాణ జానపద పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఏ కొత్త పాట వచ్చినా మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వస్తున్నాయి. ఒకటి రెండు కాకుండా ఏకంగా వందల మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. ఏ పార్టీ జరిగినా.. ఫంక్షన్ జరిగినా అవే పాటలను మోగిస్తున్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో సింగర్ మంగ్లీ చేసిన బావిలోనే బల్లి పలికే అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటను స్వయంగా మంగ్లీ పాడటంతో పాటు వీడియోలో స్టెప్పులు వేశారు.
నెల రోజుల క్రితం పాటను విడుదల చేయగా ఇప్పటి వరకు 60 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ పాటను ఓ బిహారీ పాట నుండి కాపీ కొట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నౌర మజా దారుద్యా అనే పాట నుండి బావిలోనే బల్లిపలికే పాటను లేపేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు పాటల మ్యూజిక్ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంది. దీంతో బిహారీ పాట నుండి బావిలోనే పాటను కాపీ కొట్టారని కానీ రెండు బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
బిహారీ పాట నుండి కాపీ చేశారా?
వైరల్ అవుతున్న రెండు పాటల పోలిక
“బావిలోనే బల్లి పలికే” పాట విజయం ఒకవైపు, కాపీ ఆరోపణలు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి. రెండు పాటల సంగీతం సారూప్యత నిజంగా కాపీయా, కేవలం పోలికా అన్నది తేలాల్సి ఉంది. ఈ వివాదం పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది.


