
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు 10లోకి మంగ్లీ ఎంట్రీ ఇవ్వనుందా? చర్చలు జోరుగా సాగుతున్నాయ్!
- మంగ్లీ అడిగిన రెమ్యునరేషన్ మొత్తం తెలిస్తే షాక్ అవుతారు. ఇది నిజమా?
- గతంలో మంగ్లీ వివాదాలు బిగ్ బాస్ లో ఆమెకు ప్లస్ అవుతాయా?
- త్వరలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఈవెంట్ స్టార్ట్ కానుంది. సామాన్యులకు అవకాశం!
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 10 సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈసారి ఫోక్ సింగర్ మంగ్లీ ఎంట్రీతో మరింత రసవత్తరంగా మారనుందని సమాచారం. ఆమె రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బిగ్ బాస్ లో మంగ్లీ సందడి?
తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. నిజానికి ఈ కాన్సెప్ట్ మనది కాదు… హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి.. తెలుగు తెరపైకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. వచ్చీ రావడంతోనే ఫస్ట్ సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బిగ్ బాస్… ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.
ఈసారి ఆడియన్స్ ను మరింతగా ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ టీం సీజన్ 10ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా ‘అగ్ని పరీక్ష’ పెట్టి.. కొంత మంది సామాన్యులకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే త్వరలో అగ్నిపరీక్ష 2 ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.
గత 9 సీజన్లలో లేనంత రేంజ్ లో సెలబ్రిటీలను ఈ సీజన్ లోకి తీసుకునేందుకు ట్రై చేస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యునరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 9 బ్లాక్ బస్టర్ అవ్వడం.. బిగ్ బాస్ టీమ్ లో ఉత్సాహం రెట్టింపుఅయ్యింది. దాంతో ఈసారీ సీజన్ ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.
రెమ్యునరేషన్ పై అంచనాలు
ఈక్రమంలోనే పలువురు ప్రముఖులను ఇప్పటికే సంప్రదించినట్టు సమాచారం. అందులో ఫోక్ సింగర్ మంగ్లీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. జానపద పాటలతో ఉర్రూతలూగించిన మంగ్లీ.. సినిమా పాటలతో మరింత పాపులర్ అయ్యింది. యూత్ లో భారీగా ఫాలోయింగ్ కూడా సాధించింది.
మంగ్లీ ఎంత పాపులర్ అయ్యిందో.. అంత కాంట్రవర్సీలను కూడా మూటగట్టుకుంది. గతంలో చిన్న చిన్న వివాదాలు మాత్రమే మంగ్లీ ఫేస్ చేసింది. కానీ ఆసారి 10 కోట్ల స్కాం ఆరోపణలతో పాటు.. హత్యా ప్రయత్నం కేసు కూడా ఉండటంతో.. మరింత చిక్కుల్లో పడింది మంగ్లీ. అయితే బిగ్ బాస్ టీమ్ ముందు నుంచే మంగ్లీ పేరును పరిశీలిస్తోందట. ఆమె హౌస్ లో ఉంటే సీజన్ అంతా రసవత్తరంగా సాగుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ బిగ్ బాస్ 10 స్టార్ట్ అయ్యే వరకూ.. మంగ్లీ పై ఉన్న కేసు ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
వివాదాలే ప్లస్ అవుతాయా?
అయితే గత రెండు మూడు సీజన్‌లుగా వివాదాస్పద వ్యక్తులను కూడా కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ టీమ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగ్లీని తీసుకోవడం వల్ల షో సూపర్ సక్సెస్ అవుతుందని టీమ్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ షోలో పాల్గొనేందుకు మంగ్లీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారానికి రూ.5 లక్షల వరకూ అడుగుతుందట. ఒకవేళ ఆమె 15 వారాల పాటు హౌస్‌లో కొనసాగితే మొత్తం రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ రెమ్యూనరేషన్ విషయంలో బిగ్ బాస్ టీమ్ కు.. మంగ్లీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఎవరు ప్రకటించలేదు కూడా. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. మరి నిజంగా మంగ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతోందా? మంగ్లీ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ ఎలా మారబోతోంది. చూడాలి.
మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


