|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మణిరత్నం ఫిదా: ఆ థ్రిల్లర్ సినిమాను వెండితెరపైనే చూడాలంటూ ప్రశంసలు!

Published: 16-02-2026, 8:35 AM
మణిరత్నం ఫిదా: ఆ థ్రిల్లర్ సినిమాను వెండితెరపైనే చూడాలంటూ ప్రశంసలు!
  • దర్శకుడు బిజోయ్ నంబియార్ రూపొందించిన ‘తు యా మైన్’ చిత్రాన్ని మణిరత్నం ప్రశంసించారు.
  • ఈ సినిమాను థియేటర్లలో చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని మణిరత్నం అన్నారు.
  • శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్కంఠభరితంగా ఉంది.
  • మణిరత్నం ప్రశంసలతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన ‘తు యా మైన్’ సినిమాను మణిరత్నం ప్రశంసించారు. ఈ చిత్రం థియేటర్లలో చూడదగినదని, ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ఆయన అన్నారు. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.

మణిరత్నం ప్రశంసలు

Mani Ratnam: ఈ రోజు సినిమా హిట్ అవడం గగనమవుతోంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలే ప్రేక్షకులను అలరిస్తాయి. కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి చిత్రాలుగా గుర్తింపు పొందుతాయి. అలా ఇప్పుడో చిత్రం దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) ప్రశంసలు అందుకుని వార్తలలో నిలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘తు యా మైన్’ (Tu Yaa Main). ఇటీవల విడుదలై ఈ చిత్రం ప్రేక్షకుల నుండి, అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర టీమ్ అంతా సంతోషించేలా.. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రశంలు కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే..

‘తు యా మైన్’ చిత్రంపై స్పందన

తాజాగా దక్షిణాదిలో నిర్వహించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్‌లో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రబృందాన్ని ఆయన ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బిజోయ్ నంబియార్ (Bejoy Nambiar) ఈ చిత్రంతో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఒక ప్రత్యేక అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. చిత్రయూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడండి. మంచి అనుభూతిని పొందుతారు’’ అని మణిరత్నం ప్రశంసలు కురిపించారు. దీంతో చిత్రయూనిట్‌ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

చిత్ర యూనిట్ ఆనందం

ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన అనంతరం, మణిరత్నంతో పాటు సినిమా చూసిన వారంతా సినిమాపై పాజిటివ్‌గా స్పందించినట్లుగా మేకర్స్ తెలిపారు. కొందరు దీనిని ‘అద్భుతమైన సినిమా’గా అభివర్ణిస్తే, మరికొందరు ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ సరికొత్త అనుభూతిని ఇచ్చాయని అంటున్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడంతో చాలా హ్యాపీగా ఉందని, ఆయన మాటలు సినిమా విజయానికి మరింత బలాన్నిచ్చాయని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి నిర్మాతలు. యువతను లక్ష్యంగా చేసుకుని, ఇంతకు ముందెన్నడూ చూడని ఎమోషన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను రూపొందించామని నిర్మాతలు తెలిపారు.

మొత్తానికి మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడు ప్రశంసలు కురిపించడంతో ‘తు యా మైన్’ చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా విజయానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.