|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మణిరత్నం డైరెక్ట్ చేసిన టాప్ 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందే వీటిని ఈ ఓటీటీలో చూసేయండి

Published: 04-06-2025, 8:20 AM
మణిరత్నం డైరెక్ట్ చేసిన టాప్ 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందే వీటిని ఈ ఓటీటీలో చూసేయండి

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, ఆయన తీసిన అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

మణిరత్నం గారి టాప్ 7 బ్లాక్ బస్టర్ సినిమాలు మీ కోసం!

2

నాయకుడు, దళపతి, మౌనరాగం వంటి క్లాసిక్స్ ఓటీటీలో చూడండి!

4

ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో ఈ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

మణిరత్నం గారి అద్భుతమైన సినిమా ప్రయాణం

మణిరత్నం.. ఇండియా మెచ్చే దర్శకుల్లో ఒకరు. అలాంటి డైరెక్టర్ నుంచి ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ రాబోతోంది. 1987 తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన సినిమా ఇది. గురువారం (జూన్ 5) సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ లెజెండరీ డైరెక్టర్ తీసిన గొప్ప సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.

మణిరత్నం తీసిన సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్, కల్ట్ క్లాసిక్ హోదా సొంతం చేసుకున్న సినిమా నాయకుడు. అంతేకాదు అతని సినిమాల్లో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ 8.6 సొంతం చేసుకుంది. ఈ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు. ఇందులో కమల్ హాసన్ నటన మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు బాంబేని వణికించిన వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది.

మణిరత్నం తీసిన దళపతి మూవీకి 8.5 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరిగే సినిమా. రజనీకాంత్ , మమ్ముట్టిలాంటి సూపర్ స్టార్లు ఇందులో నటించారు. సూర్య, దేవరాజ్ పాత్రల్లో వీళ్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రైమ్ వీడియోలో మూవీని చూడొచ్చు.

3. మౌనరాగం – ప్రైమ్ వీడియో, యూట్యూబ్

ఓటీటీలో అందుబాటులో ఉన్న మణిరత్నం క్లాసిక్స్

మౌనరాగం మూవీ 1986లో వచ్చింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ ఉంది. రేవతి, మోహన్, కార్తీక్ లాంటి వాళ్లు నటించారు. తన ప్రేమికుడిని కోల్పోయిన ఓ యువతి మరొకరిని పెళ్లి చేసుకొని అతనితో జీవితంలో అడ్జెస్ట్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో , యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది.

4. గీతాంజలి – ప్రైమ్ వీడియో

నాగార్జున కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్ గీతాంజలి . మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1989లో రిలీజైంది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది. త్వరలోనే చనిపోతామని తెలిసినా ప్రేమలో పడే ఓ యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథ ఇది. ఓ కల్ట్ క్లాసిక్. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

అంజలి మరో సూపర్ క్లాసిక్ మూవీ. ఓ దివ్యాంగురాలైన చిన్నారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. షామిలి ఇందులో అద్భుతంగా నటించింది. చిన్నారులతోనే మణిరత్నం అద్భుతాలు చేయగలడని నిరూపించిన సినిమా ఇది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న ఈ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.

థగ్ లైఫ్ కు ముందు మణిరత్నం సినిమాలను ఆస్వాదించండి

6. రోజా – ప్రైమ్ వీడియో, యూట్యూబ్

మణిరత్నం డైరెక్షన్ లో 1992లో వచ్చిన మూవీ రోజా. కశ్మీర్ ఉగ్రవాదానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ లెజెండరీ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ మూవీని ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లో చూడొచ్చు. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న సినిమా ఇది.

7. బాంబే – ప్రైమ్ వీడియో, యూట్యూబ్

బాంబే కూడా మణిరత్నం కెరీర్లోని బెస్ట్ సినిమాల్లో ఒకటి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి బాంబే నగరంలో జరిగిన అల్లర్ల ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది. ఈ సినిమా కూడా ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సొంతం చేసుకుంది.

మణిరత్నం గారి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసిన అద్భుతమైన సృష్టులు. ఈ సినిమాలను ఓటీటీలో చూసి ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.