
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు యూకేలోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హీరామండి వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు ఈ గుర్తింపు దక్కింది.
Key Points
మనీషా కొయిరాలాకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
హీరామండి వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్ పాత్రలో మనీషా నటించింది.
లస్ట్ స్టోరీస్ తో మనీషా సినీ రంగంలోకి తిరిగి వచ్చింది.
ఈ గౌరవం తన కృషికి, వైఫల్యాలను ఎదుర్కొన్నందుకు గుర్తుగా ఉందని మనీషా పేర్కొంది.
గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న మనీషా
చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది . యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ను అందించింది . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా . తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది . తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.
కాగా .. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది . ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది . నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది . మన ప్రయాణం ఎక్కడ మొదలైనా .. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్ లో ప్రస్తావించింది . తనను గుర్తించిన బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది .
హీరామండిలో మల్లికాజాన్ పాత్ర
మనీషా తన ఇన్ స్టాలో రాస్తూ .. ‘ బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది . ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్ -2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం . క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది . 2025 కు అభినందనలు .. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది ‘ పోస్ట్ చేసింది .
మనీషా కొయిరాలా సినీ జీవితం
ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది . ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే , కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది . ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది . ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది . ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్‌లోని హీరా మండిలో నవాబులు , బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ ను తెరకెక్కించారు .
మనీషా కొయిరాలాకు లభించిన గౌరవ డాక్టరేట్ ఆమె కెరీర్‌కు నిదర్శనం. హీరామండి సిరీస్ తో ఆమె నటనకు మరోక అరుదైన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో ఆమె మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.


