|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aditi Rao Hydari: హీరామండి సక్సెస్‌.. అవకాశాల కోసం వెయిటింగ్: అదితిరావు హైదరి

Published: 17-06-2025, 5:50 AM
Aditi Rao Hydari: హీరామండి సక్సెస్‌.. అవకాశాల కోసం వెయిటింగ్: అదితిరావు హైదరి

బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ ‘హీరామండి’ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, పెళ్లి తర్వాత ఆమె కొత్త సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఆమె తన ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడింది.

Key Points

1

అదితి రావు హైదరీ 'హీరామండి' సిరీస్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

2

పెళ్లి తర్వాత కొత్త సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

4

'ఓ సాథీ రే' మరియు 'పరివారిక్ మనురంజన్' అనే సిరీస్ ల్లో నటించనుంది.

‘హీరామండి’ తర్వాత అదితి రావు హైదరీ అనుభవం

బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింగి. హీరో సిద్ధార్థ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె చివరిసారి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’లో కనిపించింది. ఈ సిరీస్‌లో తన నటనకు గానూ  ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సిరీస్‌ తర్వాత పెళ్లి చేసుకున్న బ్యూటీ.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాను ఓకే చేయలేదు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ వెల్లడించింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడింది.

కొత్త సినిమా అవకాశాల కోసం ఎదురుచూపు

అదితి రావు మాట్లాడుతూ.. ‘ హీరామండి తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమ, ప్రశంసలు వచ్చాయి. అయితే నేను నా నెక్ట్స్‌ ఎలాంటి సినిమాకు ఇప్పటి వరకు సంతకం చేయలేదు. ఇంకా అవకాశాల కోసం వేచి ఉన్నా. జీవితంలో సమాన భాగస్వామిలాగే తెరపై మహిళలకు కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నా’ అని పంచుకుంది.

సినిమా పరిశ్రమలో మహిళలకు సమానత్వం

కాగా.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ మే 1, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తహా షా బాదుస్షా, అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం అదితి రావు హైదరి ‘ఓ సాథీ రే’లో అనే సిరీస్‌లో నటించనుంది. ఆ తర్వాత ‘పరివారిక్ మనురంజన్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనుంది.

అదితి రావు హైదరీ తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. సినిమా రంగంలో మహిళలకు సమాన అవకాశాలు లభించాలని ఆమె ఆకాంక్షించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.