|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manushi Chhillar: ‘పురుషులు సక్సెస్‌ అయితే ‍అలా.. అదే మహిళలు సాధిస్తే’..మానుషి చిల్లర్ ఆవేదన!

Published: 31-05-2025, 11:18 AM
Manushi Chhillar: 'పురుషులు సక్సెస్‌ అయితే ‍అలా.. అదే మహిళలు సాధిస్తే'..మానుషి చిల్లర్ ఆవేదన!

మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తాజాగా సినీ పరిశ్రమలో మహిళలకు ఎదురవుతున్న అన్యాయం గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పురుషులు, మహిళలు సాధించే విజయాలకు ఉన్న తేడాను ఆమె వివరించారు.

Key Points

1

మానుషి చిల్లర్ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.

2

సినిమా పరిశ్రమలో మహిళలకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

4

పురుషులు సక్సెస్ అయితే అలా.. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారని ఆమె అన్నారు.

మానుషి చిల్లర్ ఆవేదన

మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనదేశంలో మిస్ వరల్డ్‌ పోటీలు జరుతుగున్న వేళ.. ఏ రంగంలోనైనా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి గౌరవం  లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కేవలం గ్లామర్‌ వస్తువుగానే చూస్తున్నారని మానుషి చిల్లర్‌ అభిప్రాయపడింది. తాజాగా ట్విటర్ వేదికగా ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

సినిమా పరిశ్రమలో మహిళల స్థితి

మానుషి తన ట్వీట్‌లో  రాస్తూ.. ‘స్త్రీల పట్ల ద్వేషపూరిత మనస్తత్వం ఉన్నవారు.. స్త్రీ సాధించిన విజయం కంటే ఆమె వెనుక పురుషుడి ఉన్నాడని ఆపాదించడం సులభంగా భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలను పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశా. కానీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే మహిళలను అగౌరవంగా చూడడం.. నేను నిరంతరం గమనిస్తూనే ఉన్నా. లింగ భేదం లేకుండా మనమందరం సమాన విలువ, సాధికారత, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాం. కానీ పురుషులు విజయం సాధిస్తే కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులని పొగుడుతారు. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారు. ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నా. ఒక స్త్రీ గురించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చెడుగా మాట్లాడడం అంత సులభమా? లేదా ఏళ్లుగా పాతుకుపోయిన పక్షపాతమా’ అని ప్రశ్నించింది. ముఖ్యంగా మహిళల విజయాన్ని పురుషులకు అపాదించడాన్ని మానుషి చిల్లర్‌ విమర్శిస్తోంది.

లింగ వివక్షపై మానుషి వ్యాఖ్యలు

ఇక సినిమాల విషయానికొస్తే మానుషి చిల్లర్‌.. అక్షయ్ కుమార్  నటించిన  పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  విక్కీ కౌశల్ సరసన’ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’లో నటించింది. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్ సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’లో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించింది. మానుషి చివరిసారిగా ‘బడే మియాన్ చోటే మియాన్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మాజీ మిస్ వరల్డ్ జాన్ అబ్రహం థ్రిల్లర్ మూవీ’టెహ్రాన్’లో కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ 017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మహిళల విజయాలను అంగీకరించడంలోని ఇబ్బందులను, సమాజంలోని లింగ వివక్షను మానుషి చిల్లర్ హైలైట్ చేశారు. సమాన అవకాశాల కోసం ఆమె పోరాటాన్ని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.