|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మార్గన్: విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ తెలుగు హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..

Published: 13-06-2025, 7:09 AM
మార్గన్: విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ తెలుగు హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..

విజయ్ ఆంటోనీ నటించి, నిర్మించిన ‘మార్గన్’ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది.

Key Points

1

విజయ్ ఆంటోనీ నటించిన ‘మార్గన్’ సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

2

సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు హక్కులు కొనుగోలు చేసింది.

4

విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా నటిస్తున్నారు.

‘మార్గన్’ విడుదల తేదీ

విజయ్ ఆంటోని (Vijay Antony) నటిస్తూ, నిర్మించిన లేటెస్ట్ చిత్రం ‘మార్గన్’ (Margan). లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్‌పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ (Murder Mystery-Crime) థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘మార్గన్’ సినిమాపై అంచనాల్ని పెరిగాయి.

అయితే.. ఇలాంటి కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని అందించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ‘మార్గన్’ మీదున్న నమ్మకంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ (Suresh Entertainment) భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, నిర్మాత విజయ్ ఆంటోని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా.. ఈ మూవీలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు హక్కులు సొంతం చేసుకున్న సంస్థ

చిత్ర నటీనటులు మరియు కథాంశం

సురేష్ ప్రొడక్షన్స్ ‘మార్గన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ద్వారా ఈ సినిమాకు మరింత వ్యాప్తి లభిస్తుందని ఆశిద్దాం. విజయ్ ఆంటోనీ అభిమానులకు ఇది గొప్ప విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.