|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ జోకర్ లుక్ వెనుక సీక్రెట్ అదే! రాజాసాబ్ 2 లీక్ చేసిన మారుతీ.. అందుకేనా?

Published: 02-01-2026, 9:00 PM
ప్రభాస్ జోకర్ లుక్ వెనుక సీక్రెట్ అదే! రాజాసాబ్ 2 లీక్ చేసిన మారుతీ.. అందుకేనా?
  • ది రాజాసాబ్ లో ప్రభాస్ జోకర్ లుక్ పై దర్శకుడు మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • జోకర్ లుక్ వెనుక పెద్ద కథ ఉందని, అది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుందని మారుతీ వెల్లడించారు.
  • ఇంటర్వ్యూలో మాటల మధ్యలో ‘రాజాసాబ్ 2’ గురించి మారుతీ అనుకోకుండా చెప్పేశారు.
  • సలార్ 2, కల్కి 2 తర్వాత ప్రభాస్ లైనప్‌లో ఇప్పుడు ‘రాజాసాబ్ 2’ కూడా చేరింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్ వెనుకనున్న కథ గురించి దర్శకుడు మారుతీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనుకోకుండా ‘రాజాసాబ్ 2’ గురించి కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రభాస్ జోకర్ లుక్: అంచనాలకు మించి అసలు కథ!

ది రాజాసాబ్(The Rajasaab) సినిమాలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు మారుతీ.

Director Maruthi interesting comments on Prabhas joker look in the Raja Saab movie.

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అనుకోకుండా రాజాసాబ్ 2 బయటపెట్టిన మారుతీ

తాజాగా ది రాజాసాబ్(The Rajasaab) ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు మేకర్స్. చిత్ర యూనిట్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు మారుతీ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే, తనకు తెలియకుండానే ది రాజాసాబ్ మూవీ గురించి పెద్ద అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు మారుతీ. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించిన దాని గురించి అడిగారు.

Hebah Patel: అబ్బా అనిపిస్తున్న హెబ్బా అందాలు.. శారీలో గ్లామర్ ఫోటోలు

సీక్వెల్స్ స్టార్‌గా ప్రభాస్ రికార్డు

ఒక ఐకానిక్ పాత్రను మళ్ళీ చేయడానికి స్టార్స్ ముందుకు రారు. దానికి, ప్రభాస్ ని ఎలా ఒప్పించారు అని అడిగాడు. దానికి మారుతూ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించటానికి పెద్ద కథే ఉంది. అది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుంది. ఆ ఆ లుక్ కి సంబదించిన ప్రాధాన్యతను ప్రభాస్ కి వివరించాను ఆయన ఒప్పుకున్నాడు’అంటూ చెప్పుకొచ్చాడు. ఆలా ఫ్లోలో రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు మారుతీ.

దీంతో ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం తమ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్న హీరోలలో టాప్ లో ఉన్నాడు ప్రభాస్. సలార్ 2, కల్కి 2 ఇప్పుడు రాజాసాబ్ 2. మరి ఈ సీక్వెల్స్ ఎప్పుడు అవుతాయో ఎప్పుడు థియేటర్స్ కి వస్తాయి తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం మంచి కిక్ ఇస్తున్నాయి.

మారుతీ నోరుజారినప్పటికీ, ‘రాజాసాబ్ 2’ వార్త ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ప్రభాస్ వరుస సీక్వెల్ చిత్రాల లైనప్ తో మరింత ఉత్సాహం నింపుతున్నారు. ఈ సీక్వెల్స్ థియేటర్లలో ఎప్పుడు సందడి చేస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.