|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాక్ అవ్వడం పక్కా! రాజసాబ్‌ కోసం మారుతి తీసుకున్న భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Published: 01-01-2026, 1:00 AM
షాక్ అవ్వడం పక్కా! రాజసాబ్‌ కోసం మారుతి తీసుకున్న భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  • దర్శకుడు మారుతి పోస్టర్, గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ మొదలుపెట్టి పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు.
  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాజాసాబ్’ సినిమా హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో భారీగా తెరకెక్కుతోంది.
  • ‘రాజాసాబ్’ సినిమాకు డైరెక్టర్ మారుతికి ఏకంగా 18 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం.
  • ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350-400 కోట్ల వరకు ఉండగా, అధిక భాగం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేశారు.

దర్శకుడు మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు మారుతి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మూడేళ్ల కష్టానికి ఆయన అందుకున్న పారితోషికం వివరాలు ఇక్కడ.

మారుతి ప్రస్థానం: చిన్న సినిమాల నుండి పాన్ ఇండియా వరకు

భారీ బడ్జెట్ తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. (Director Maruthi)

Director Maruthi : పోస్టర్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ మొదలుపెట్టిన మారుతి ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారి చిన్న సినిమాలు తీస్తూ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మెప్పిస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా తీసే రేంజ్ కి ఎదిగాడు.(Director Maruthi)

భారీ బడ్జెట్ తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

రాజాసాబ్ విశేషాలు: భారీ బడ్జెట్, గ్రాఫిక్స్

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇప్పటివరకు కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రాజాసాబ్ సినిమాకు తీసుకున్నాడట మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాకు గాను డైరెక్టర్ మారుతీ ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

మారుతి రెమ్యునరేషన్: కెరీర్ లోనే అత్యధికం

ఈ సినిమా వర్క్ మొదలయి ఆల్మోస్ట్ మూడేళ్లు అవుతుంది. మూడేళ్ళ కష్టానికి గాను మారుతీకి 18 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇక రాజాసాబ్ సినిమాకు దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాలీవుడ్ టాక్. ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ కే ఖర్చుపెట్టారట. మరి రాజాసాబ్ సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, మారుతి భారీ రెమ్యునరేషన్‌తో ‘రాజాసాబ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 9న రానున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.