
📌 Key Points
- ప్రియాంక చోప్రా నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కి మొదటి అతిథిగా హాజరయ్యారు.
- రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ‘వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని కపిల్ ప్రస్తావించాడు.
- సినిమా బడ్జెట్ పెరగడానికి ప్రియాంక రెమ్యునరేషనే కారణమా అని కపిల్ శర్మ నేరుగా ప్రశ్నించాడు.
- రూ.1300 కోట్ల బడ్జెట్‌పై ప్రియాంక చోప్రా నవ్వుతూ పరోక్షంగా ‘అవును’ అని సమాధానం ఇచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా కపిల్ శర్మ షోకి వచ్చి అలరించింది. ఈ సందర్భంగా ఆమె రాజమౌళి ‘వారణాసి’ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రూ.1300 కోట్ల బడ్జెట్‌పై కపిల్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లా? కపిల్ ప్రశ్న
వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తాజాగా కమెడియన్ కపిల్ శర్మ షోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె వారణాసి మూవీ గురించి కూడా మాట్లాడింది. మూవీ బడ్జెట్, తన రెమ్యునరేషన్ గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కొత్త సీజన్ ప్రారంభమైంది. మొదటి గెస్ట్‌గా వచ్చిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అని కపిల్ శర్మ అడగగా.. ఆమె అవునని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది.
వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లా?
ప్రియాంక చోప్రా నవ్వు వెనుక ఉన్న నిజం!
ఈ షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ.. “ప్రియాంక ఏం చేసినా అది భారీగానే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు. ఆయన బడ్జెట్లు మనకు తెలిసిందే. కానీ ప్రియాంక ఈ సినిమాలో ఉన్నందు వల్ల బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అయ్యిందని విన్నాను. సినిమాకేనా లేక వారణాసిలో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా” అని అడిగాడు.
దీనిపై ప్రియాంక స్పందించింది. ఆ నంబర్ వినగానే ఆడియన్స్ షాక్ అయ్యారు. కానీ ప్రియాంక మాత్రం చిరునవ్వుతో “అవును” అని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్లు అనేది దాదాపు ఖరారైనట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నీ వల్లే బడ్జెట్ పెరిగిందా?
రెమ్యునరేషన్‌పై కపిల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
కట్టప్ప సీక్రెట్‌లాగా అది మాత్రం అడగొద్దు
‘వారణాసి’ సినిమా విశేషాలు
కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా నవ్వుతూ అవును అని చెప్పడం ద్వారా ‘వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని దాదాపు ఖరారైనట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


