
📌 Key Points
- పవన్ కళ్యాణ్ పై విమర్శలు బాధించాయన్న తనీష్, సైనికుడి కొడుకుగా ఆవేదన వ్యక్తం చేశారు.
- జనసేన తరపున తెలంగాణలో తనీష్ యాక్టివ్ ప్రచారం, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
- దేశ సమైక్యత కోసం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తనీష్ ప్రసంగం ఇప్పుడు వైరల్ అవుతోంది.
- ప్రాంతీయతత్వంపై పోరాటం, సైనికుల త్యాగాలను గుర్తుచేస్తూ నటుడు గట్టి సందేశం ఇచ్చారు.
టాలీవుడ్ నటుడు తనీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి! పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తూ, ఒక సైనికుడి కొడుకుగా ఆయన వ్యక్తం చేసిన భావోద్వేగాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చదవండి!
తెలంగాణలో జనసేన ప్రచారం: తనీష్ దూకుడు
Tanish : ఇటీవల పలువురు తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణకు రావద్దంటూ, ఇక్కడ పోటీ చేయొద్దంటూ పలువురు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ సభకి కూడా అనుమతి ఇవ్వలేదు. వీటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నటుడు తనీష్ జనసేన తరపున తెలంగాణలో యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా జనసేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం అనే కార్యక్రమంలో తనీష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సైనికుడి కొడుకుగా తనీష్ ఆవేదన
తనీష్ మాట్లాడుతూ.. మా నాన్న ఒక సోల్జర్. దేశం కోసం పనిచేసారు. రాజస్థాన్, ఢిల్లీ, హైదరాబాద్ లో పనిచేసారు. నేను చిన్నప్పుడు ఆర్మీ సెక్టార్ లో పెరిగినప్పుడు ఈ కులం, మతం అని వచ్చేవి కావు. ఆయన పనిచేసేటప్పుడు ఏ రోజు కూడా ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని అనుకోలేదు. ఒక దేశం కోసం కోసం పనిచేస్తున్నాను అనే అనుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు తనీష్ మద్దతు
ఈ రోజు నేను జనసేన తరపున తెలంగాణలో మాట్లాడుతుంటే వీడెక్కడ పుట్టాడు అని మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతంలో పుట్టాను అని అడిగే బాధ కంటే ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుకుగా వింటుంటే బాధేస్తుంది. బోర్డర్ లో దేశం కోసం పోరాడే సైనికులు ఇలాంటి వార్తలు చూసి ఏం ఫీల్ అవుతారు అనేది ఒక్క పౌరుడు కూడా ఆలోచించట్లేదు. అది ఆలోచించాలి. దేశం కోసం ప్రతి రాష్ట్రం నుంచి కంట్రిబ్యూట్ చేయాల్సింది పోయి నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు, నీకేం హక్కు ఉందని మాట్లాడతావు అనడం కరెక్ట్ కాదు అని అన్నారు.
తనీష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశభక్తి, ప్రాంతీయతత్వంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


