|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మసూద్ అజార్ కుటుంబంలో విషాదం! సోదరుడు హఠాన్మరణం!

Published: 30-03-2026, 4:05 PM
మసూద్ అజార్ కుటుంబంలో విషాదం! సోదరుడు హఠాన్మరణం!
  • జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మృతి.
  • తాహిర్ అన్వర్ పాకిస్తాన్‌లోనే మార్చి 30న మరణించినట్లు జాతీయ మీడియా కథనాలు.
  • మహమ్మద్ తాహిర్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
  • జైష్-ఎ-మహ్మద్ సంస్థలో ఆయుధాల ట్రైనర్‌గా తాహిర్ పనిచేసినట్లు సమాచారం.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇది ఒక పెద్ద షాక్. జైష్-ఎ-మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మార్చి 30న పాకిస్తాన్‌లో మరణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మృతి చెందిన మసూద్ అజర్ సోదరుడు ఎవరు?

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ( Masood Azhar) సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోనే మార్చి 30వ తేదీన మహమ్మద్ తాహిర్ అన్వర్ ( Muhammad Tahir Anwar ) మరణించాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మహమ్మద్ తాహిర్ ఎలా చనిపోయాడు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు.

తాహిర్ అన్వర్ మరణానికి గల కారణాలు ఏమిటి?

అనారోగ్యం కారణంగా మరణించాడా ? లేదా ఏదైనా దాడి జరిగిందా ? అనే విషయం పైన పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఈ మరణ వార్త మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కాగా జైష్-ఎ-మహ్మద్ సంస్థలో అత్యంత కీలక పాత్ర పోషించాడు తాహిర్ అన్వర్. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ఆయుధాల ట్రైనర్ గా తాహిర్ పనిచేసినట్లు చెబుతున్నారు. అంటే తమ సంస్థలో కొత్తగా చేరిన వాళ్లకు ఆయుధాలు ఎలా వాడాలి అనే దాని పైన ట్రైనింగ్ ఇచ్చేవాడట. అటు ల‌ష్క‌ర్ తోయిబా సంస్థ హ‌ఫీజ్ స‌యూద్ కు కూడా స‌న్నిహితుడు.

జైష్-ఎ-మహ్మద్‌లో తాహిర్ పాత్ర

A post shared by JAMMU DIARIES 🇮🇳 (@jammudiaries)

మొత్తానికి మసూద్ అజర్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మరణం ఉగ్రవాద సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.