
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకకు నటుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవితేజను ప్రశంసిస్తూ, ఆయన ఎందరికో స్ఫూర్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో రవితేజతో నటించాలని ఆకాంక్షించారు.
Key Points
రవితేజ 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమిళ నటుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రవితేజ శక్తికి, నటనకు తాను అభిమానినని, ఆయన ఎందరికో స్ఫూర్తి అని సూర్య కొనియాడారు.
భవిష్యత్తులో రవితేజతో కలిసి నటించాలనే తన ఆశను సూర్య వ్యక్తం చేశారు.
రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర నటించిన 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కానుంది.
రవితేజపై సూర్య ప్రశంసల వర్షం
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’(mass jathara). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ, శ్రీలీల(sreeleela), నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
20 ఏళ్ళ అనుబంధం.. నటించాలని ఆశ
ఈ ఈవెంట్‌లో భాగంగా సూర్య మాట్లాడుతూ.. “రవితేజ గారి అభిమానులను, నా అభిమానులను ఇలా చూడటం ఆనందంగా ఉంది. అభిమానుల మధ్యలో జరిగే ఇలాంటి వేడుకకు హాజరవ్వడం నాకిష్టం. రవితేజ గారితో నాది 20 ఏళ్ళ అనుబంధం. ఈ రోజు ఒక ఫ్యాన్ బాయ్ లా మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ గారు. తెరపై ఒక కామన్ మ్యాన్‌ని కింగ్ సైజ్‌లో సహజంగా చూపించాలంటే అది రవితేజ గారికే సాధ్యమవుతుంది. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ గారు మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రవితేజ గారు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ గారి జాతర చూడబోతున్నాం.
‘మాస్ జాతర’ అంచనాలు
రవితేజ గారిపై దర్శకుడు భానుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్ గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ గారు ఎందరికో స్ఫూర్తి. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాము. అక్టోబర్ 31 విడుదలవుతున్న మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు. రవితేజ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో యాక్షన్ బాగుందంటే ఆ క్రెడిట్ మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీకి వెళ్తుంది. ఈ సాంగ్స్ మీరు థియేటర్ లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. నవీన్ ఇలా కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. సినిమా విడుదలయ్యాక శివుడు పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. ఫుల్ మాస్ పాత్ర చేసింది. ఈరోజు గెస్ట్ గా విచ్చేసిన సూర్య గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా అభిమానులను అసలు నిరాశపర్చదు. ఇది నా హామీ.” అన్నారు.
సూర్య ప్రశంసలతో ‘మాస్ జాతర’పై అంచనాలు మరింత పెరిగాయి. రవితేజ వినోదాన్ని పంచుతూ, అక్టోబర్ 31న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.


