|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ మహారాజా రవితేజ ఊహించని షాక్.. ఆ గ్యాప్ వెనుక అసలు రహస్యం ఇదే! ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ వైరల్!

Published: 07-01-2026, 7:35 AM
మాస్ మహారాజా రవితేజ ఊహించని షాక్.. ఆ గ్యాప్ వెనుక అసలు రహస్యం ఇదే! 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ వైరల్!
  • జనవరి 13న థియేటర్లలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్రాండ్ రిలీజ్!
  • కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ కామెడీ విశ్వరూపం!
  • ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ తళుకులు!
  • గన్లు, కత్తులు వదిలేసి.. ప్రేమకథలోకి రవితేజ ఎంట్రీ హైలైట్!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది! పండక్కి నవ్వుల పటాకాలు పేల్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా, రవితేజ ఊహించని గ్యాప్ గురించి చెప్పిన డైలాగ్‌తోనే ఆసక్తిని పెంచేసింది. సంక్రాంతికి అదిరిపోయే వినోదం పక్కా!

మాస్ మహారాజా ఊహించని గ్యాప్ వెనుక నిజం!

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాన్ని, ఆనందాన్ని పంచి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే “ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, జాతర ఫైట్ తెగ చేసేశాను. అందుకు ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమన్నాడు.” అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. “మగాళ్లందరూ మాసే అయినా.. ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాళ్లు.. టాస్ వేసి బొమ్మా, బొరుసా నిలబెట్టారు. పండగ కదా ముందు ఎంటర్టైన్మెంట్.. తర్వాత అనౌన్స్ మెంట్. బుక్ మై షో అంటే ఇదే.. మన షో మనమే బుక్ చేసుకోవడం వంటి డైలాగ్స్ ట్రైవర్ కు హైలైట్ గా నిలిచాయి.

ట్రైలర్ ను బట్టి చూస్తే పెళ్లైన భర్త ప్రేమలో పడితే ఆ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పే కథే భర్తమహాశయులకు విజ్ఞప్తి స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి నటించగా.. సునీల్, సత్య, డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు.

ట్రైలర్ లో రవితేజ మార్క్ కామెడీ జాతర!

సంక్రాంతికి పండగ లాంటి కథతో వస్తున్నాడు!

రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి విజేతగా నిలవడం ఖాయం. ట్రైలర్ తోనే ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.