|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ రోజే మాస్‌ జాతర?

Published: 07-09-2025, 2:48 PM

రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి భాను బోగవరపు దర్శకత్వం వహించారు. చిత్రీకరణ తుది దశలో ఉంది.

Key Points

1

రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కానుంది.

2

శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది.

మాస్ జాతర విడుదల తేదీ

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాస్‌ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే  పోలీస్‌ లక్ష్మణ్‌ భేరి పాత్ర  చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్‌ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా  ప్లాన్‌ చేశారని టాక్‌. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్‌ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్‌ సన్నాహాలు చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. మరి… వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్‌ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే.

నటీనటుల సమాచారం

చిత్రీకరణ వివరాలు

చివరి నిమిషం మార్పులకు అవకాశం ఉండటంతో, ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.