|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mayasabha : ఇద్దరు స్నేహితుల కథ.. ‘మయసభ’ సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ – చంద్రబాబు కథతో?

Published: 12-07-2025, 1:44 PM
Mayasabha : ఇద్దరు స్నేహితుల కథ.. ‘మయసభ’ సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ – చంద్రబాబు కథతో?

సోనీ లివ్ ఓటీటీలో త్వరలో రానున్న ‘మయసభ’ సిరీస్ టీజర్ విడుదలైంది. ఆది పినిశెట్టి మరియు చైతన్య రావు నటించిన ఈ సిరీస్ వైఎస్సార్ మరియు చంద్రబాబుల జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Key Points

1

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో

2

వైఎస్సార్, చంద్రబాబు జీవితాల ఆధారంగా తీసిన సిరీస్

4

టీజర్ ఇప్పటికే విడుదలైంది

మయసభ సిరీస్ టీజర్ విడుదల

Mayasabha : తాజాగా సోనీ లివ్ ఓటీటీలోకి ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ఆది పినిశెట్టి, చైతన్య రావు ముఖ్య పాత్రలుగా ఈ సిరీస్ దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నేడు ఈ సిరీస్ ని ప్రకటించి టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు.

ఈ టీజర్ చూస్తుంటే వైఎస్సార్- చంద్రబాబు నాయుడు కథతో తీసినట్టు తెలుస్తుంది. వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు అయినా మంచి మిత్రులు అని తెలిసిందే. ఇద్దరూ ఈ విషయాన్ని గతంలో పలుమార్లు తెలిపారు. ఈ ఇద్దరి పొలిటికల్ కెరీర్ ముందు, పాలిటిక్స్ లోకి వచ్చాక ఏం జరిగింది అనే కథాంశంతోని ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఆది పినిశెట్టి చంద్రబాబు పాత్రలో, చైతన్య రావు వైఎస్సార్ పాత్రలో కనిపించబోతున్నారు. మయసభ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

వైఎస్సార్, చంద్రబాబు జీవితాల ఆధారంగా

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

మీరు కూడా ఈ మయసభ టీజర్ చూసేయండి..

మొత్తంమీద, ‘మయసభ’ సిరీస్ వైఎస్సార్ మరియు చంద్రబాబుల మధ్య స్నేహం మరియు రాజకీయ ప్రయాణాన్ని చూపించే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఆగస్టు 7 నుండి సోనీ లివ్ లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.