
📌 Key Points
- 20 ఏళ్ల క్రితం రూ.10 కోట్ల లోన్ తీసుకున్న మీనా.
- తమిళనాడులో హెరిటేజ్ బంగ్లా నిర్మించిన నటి మీనా.
- అమెరికా జంటకు రూ.100 కోట్లకు అమ్మిన మీనా.
- కూతురు నైనిక ‘తెరి’ సినిమాలో విజయ్ కూతురిగా నటించింది.
హీరోయిన్ మీనా గురించి ఒక సంచలన వార్త! మీనా తన తెలివితేటలతో ఒక ఇంటిని కొని, దానిని ఒక అద్భుతమైన ధరకు అమ్మేశారు. ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
మీనా రియల్ ఎస్టేట్ వ్యూహం
సహజమైన అందం, అద్భుతమైన నటనతో మీనా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1980-90ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, శ్రీకాంత్, తమిళంలో.. రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్, శరత్‌కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో టాప్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది.
ఇప్పటికీ కూడా తమిళం, తెలుగు, మలయాళంలో బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది మీనా. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ‘దృశ్యం 3’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
10 కోట్ల నుండి 100 కోట్లకు ఎలా?
నటి మీనా తన బిజినెస్ టాలెంట్ ను చూపించారు. తాాజాగా మీనకు సబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 20 ఏళ్ల క్రితం, ఆమె పెద్ద రిస్క్ చేసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు ఆమెకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లోనే బ్యాంకు నుంచి రూ.10 కోట్ల లోన్ తీసుకుని, తమిళనాడులో ఓ పెద్ద హెరిటేజ్ బంగ్లాను మీనా కట్టించారు. చాలామంది లగ్జరీ వస్తువులపై పెట్టుబడి పెడితే, మీనా మాత్రం స్థిరాస్తిపై ఇన్వెస్ట్ చేయడం విశేషం.
ఆ ఇల్లును సంప్రదాయ వాస్తుశైలిలో నిర్మించారు. చెక్కిన చెక్క స్తంభాలు, విశాలమైన ప్రాంగణం, ప్యాలెస్ తరహా డిజైన్‌తో దాన్ని తీర్చిదిద్దారు. ఆధునిక భవనాల మధ్య ఇలాంటి పాతకాలపు కళాత్మక ఇళ్లు అరుదుగా ఉండటంతో, ఈ బంగ్లాకు ప్రత్యేక విలువ వచ్చింది. దీని అందానికి ఫిదా అయిపోయిన అమెరికాకు చెందిన ఓ జంట, ఈ ఇంటిని భారీ ధరకు కొనడానికి ముందుకొచ్చారు. చివరికి, ఆ ఇంటిని సుమారు 100 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం.
వారసత్వ బంగ్లా ప్రత్యేకత ఏమిటి?
ఒకప్పుడు అప్పుగా అనిపించిన పెట్టుబడి, ఇప్పుడు పదింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో మీనా మంచి ఇన్వెస్టర్ అని, డబ్బు విలువ తెలిసిన వ్యక్తి అని చాలామంది ప్రశంసిస్తున్నారు. 10 కోట్లకు కట్టిన ఇంటిని 100 కోట్లకు అమ్మిన మీనా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.
ఇక మీనాకు నైనిక అనే కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త సాగర్ అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటూ, తన కూతురిని పెంచుకుంటున్నారు. మీనా కూతురు నైనిక, ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) సినిమాలో విజయ్ కూతురిగా నటించింది.
మీనా తన రియల్ ఎస్టేట్ పెట్టుబడితో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


